ఫిల్మ్ సిటీలో చెమటలు చిందిస్తోన్న ప్రభాస్: యాభై మందితో ఫైటింగ్ చేయడానికి ప్లాన్
సాదాసీదాగా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. మొదట్లో ఓ మోస్తరు బడ్జెట్ చిత్రాల్లోనే నటించిన అతడు.. 'బాహుబలి' మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి మరింత జోష్‌తో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే 'సాహో' వంటి భారీ యాక్షన్ సినిమాలో నటించిన ఈ స్టార్ హీరో.. ఇటీవలే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాను సైతం పూర్తి చేశాడు. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. 'రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే ఎన్నో ప్రాజెక్టులను ప్రకటించాడు. ప్రస్తుతం అతడు ఏకంగా మూడు సినిమాలను ఏక కాలంలో చేస్తున్నాడు. అందులో కేజీఎఫ్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న 'సలార్' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

'సలార్' మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతోన్నా.. చిత్రీకరణ మాత్రం అంత వేగంగా సాగడం లేదు. దీనికి కారణం కరోనా ప్రభావంతో వచ్చిన లాక్‌డౌన్‌లే అన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే పలు కారణాలతో ఈ మూవీ చిత్రీకరణకు తరచూ ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెకెండ్ వేవ్ తర్వాత 'సలార్' మూవీ షూటింగ్‌ను పున: ప్రారంభించి చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.
'సలార్' మూవీకి సంబంధించిన షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇందులో ఈ మూవీలోనే ఎంతో హైలైట్‌గా నిలవబోయే ఇంటర్వెల్ బ్లాక్‌కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. దాదాపు ఇదొక్కటే పది రోజుల పాటు షూట్ చేయబోతున్నారని తెలిసింది. అందుకే సెప్టెంబర్ 20 వరకూ అక్కడ షూటింగ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు దాదాపు యాభై మంది వరకూ ఫైటర్లు పాల్గొనబోతున్నట్లు తెలిసింది. అంటే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఎంతటి రేంజ్‌లో ఉండబోతుందో అర్థం అవుతోంది.
క్రేజీ కాంబోలో వస్తున్న 'సలార్' మూవీ 1970 యుద్ధానికి సంబంధించిన కథతో తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నాడని.. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా, రెండోది కొడుకు రోల్ అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ జగపతి బాబు ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











