విడుదలకు ముందే సాహో సునామీ.. ప్రభాస్ సంచలనం.. సరికొత్త రికార్డ్

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుగా అని ఎదురు చూస్తున్న సాహో సినిమా ఆగస్టు 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో వస్తున్న సినిమా కావడం, భారీ బడ్జెట్‌తో రూపొందించబడటం కారణంగా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీంతో విడుదలకు సాహో రికార్డుల సునామీ సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్ర రికార్డులను తన పేరున లిఖించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'సాహో' ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వివరాల్లోకి పోతే..

భారీ ప్రమోషన్స్.. సాహోపై బాలీవుడ్ చూపు

భారీ ప్రమోషన్స్.. సాహోపై బాలీవుడ్ చూపు

షూటింగ్ చేస్తూనే ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిన చిత్ర యూనిట్.. గత కొద్దీ రోజులుగా ఆ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ముంబైలో లాంటి నగరాల్లో భారీ ప్రమోషన్స్ చేస్తుండటంతో బాలీవుడ్ బడా నిర్మాతలు సైతం సాహోపై ఆసక్తిగా ఉన్నారు.

ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేస్తూ

ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేస్తూ

తెలుగు సినిమా చరిత్రలోనే కాదు.. భారతదేశ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘సాహో' ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్, ఎక్కువ లొకేషన్లు, ఏరియాల వారీగా భారీ మొత్తానికి అమ్ముడు పోవడం, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ అత్యధిక ధర పలకడం వంటివి గత రికార్డులను బద్దలు కొట్టాయి.

భారీ రేంజ్‌లో సాహో బుకింగ్స్

భారీ రేంజ్‌లో సాహో బుకింగ్స్

ప్రస్తుతం సినీ లోకం చూపంతా సాహో సినిమాపైనే ఉండటంతో భారీ రేంజ్‌లో బుకింగ్స్ జరుగుతున్నాయి. బుకింగ్ ప్రారంభమైన కొద్దీ సేపట్లోనే సాహో టికెట్స్ దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పలు నగరాల్లోని భారీ థియేటర్స్‌‌లో తొలివారం టికెట్స్ ఇప్పటికే క్లోజ్ అయిపోయాయి.

బుక్ మై షో.. సరికొత్త రికార్డ్

బుక్ మై షో.. సరికొత్త రికార్డ్

ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్ బుక్ మై షోలో ఓ సినిమాకు 50 వేలు లేదా లక్ష లైక్స్ వస్తే ఆ సినిమాకు భారీ ఆదరణ ఉన్నట్లే. బాలీవుడ్‌లో ఖాన్‌ చిత్రాలు విడుదలకు ముందు 1 లక్ష 50 వేల నుంచి 2 లక్షల వరకు లైక్స్ పొందుతుంటాయి. అయితే ‘సాహో' మాత్రం ఖాన్ త్రయం సినిమాలను దాటేసి ఇప్పటికే 3 లక్షల 60 వేల లైక్స్ సాధించి సరికొత్త రికార్డు దిశగా పరుగు పెడుతోంది. దీంతో 'సాహో' ఓపెనింగ్ కలెక్షన్స్ భారీ రేంజ్ లో ఉంటాయని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.

 సాహో మూవీ

సాహో మూవీ

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఆగస్టు 30 న ఈ సినిమా విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X