సాహూ సందడి షురూ.. సాంగ్ టీజర్‌తో కిక్కిచ్చిన ప్రభాస్, శ్రద్ధ కపూర్
సాహూ పాటల సందడి షురూ అయింది. తాజాగా సాహూ మొదటి సాంగ్ 'కాదల్ సైకో' టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకుంది సాహూ టీమ్. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్‌లో రాబోతున్న మరో భారీ ప్రాజెక్టు 'సాహూ'. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కేవలం ఒక్క పాట మినహా షూటింగ్ అంతా ఫినిష్ చేశారు.
ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో షూటింగ్ జరుపుతూనే ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యూనిట్ సభ్యులు. ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహూ రూపంలో భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల ముందుంచిన సాహూ టీమ్ ఇప్పుడు పాటల సందడి కూడా షురూ చేసింది. ఇందులో భాగంగా సాహూ నుంచి మొదటి పాట 'కాదల్ సైకో' టీజర్ విడుదల చేశారు. తెలుగుతో పాటు ఇతర మూడు భాషల్లో రిలీజ్ చేసిన ఈ సాంగ్ టీజర్ యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో ప్రభాస్, శ్రద్ద కపూర్ ఇద్దరూ అట్రాక్టివ్ లుక్ లో దర్శనమిచ్చారు. తనిష్క్ బాగ్చి సంగీతం ఆకట్టుకుంటోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై 400 కోట్ల భారీ బడ్జెట్ తో సాహూ సినిమా తెరకెక్కుతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











