'సాహో' నుంచి మరో సర్‌ప్రైజ్.. ప్రభాస్ అభిమానులు ఫిదా అయ్యేలా!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాపైనే ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 30 న విడుదల కానున్న నేపథ్యంలో ప్రేక్షకలోకం ఆసక్తిగా ఉంది. ఈ తరుణంలో సాహో ప్రమోషన్స్ లో భాగంగా సరికొత్త సర్‌ప్రైజ్‌లతో ఆకట్టుకుంటూ సాహో పై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తోంది చిత్రయూనిట్.
ఈ మేరకు తాజాగా సాహో నుంచి ఓ లవ్ సాంగ్ రిలీజ్ చేస్తూ సర్‌ప్రైజ్ చేశారు. ప్రభాస్, శ్రద్ద కపూర్ లపై చిత్రీకటించిన ఈ సాంగ్ ''బేబీ ఓన్ట్ యు టెల్ మీ..'' అని సాగిపోతూ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన షాట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. శ్వేతా మోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేవన్ ఆలపించారు. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వేగంగా వ్యూస్ రాబడుతోంది.
ఇప్పటికే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో ఎపిసోడ్స్, లిరికల్ సాంగ్స్, సాహో పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ఈ సాంగ్ మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. తాజా అప్‌డేట్స్‌ని బట్టి చూస్తే సాహోలో యాక్షన్ సన్నివేశాలకు ధీటుగా రొమాంటిక్ డోస్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఆగస్టు 30న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











