ప్రభాస్ కోసం త్యాగం చేసిన వారి కోసం లేఖ రాసిన ‘సాహో’ టీమ్
భారతదేశ సినీ చరిత్రలో రికార్డులు క్రియేట్ చేసిన 'బాహుబలి' తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక, ఇటీవల వచ్చిన యాక్షన్ పోస్టర్‌ను చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు సైతం సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

'సాహో' ఆగస్టు 15న విడుదల అవుతుందని చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది. అయితే, అనివార్య కారణాలతో ఈ సినిమా ఈ నెల 30కి వాయిదా పడింది. దీంతో ఆ దగ్గర్లో రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడిపోవాల్సి వచ్చింది. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నీని కూడా తమ 'గ్యాంగ్ లీడర్' వాయిదా పడడానికి 'సాహో'నే కారణం అని చెప్పుకొచ్చారు.
తాజాగా దీనిపై సాహో చిత్ర యూనిట్ స్పందించింది. ఈ మేరకు యూవీ క్రియేషన్స్ సంస్థ 'సాహో కోసం తమ సినిమాలను వాయిదా వేసుకని మాకు మార్గం సుగుమం చేసిన అన్ని భాషల నిర్మాతలందరికీ థ్యాంక్స్. మా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మీరు చేసిన మేలు మరువలేము. ఆగస్టు 30న సాహో యాక్షన్ మొదలవుతుంది' అని ట్వీట్ చేసింది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేసింది.


Click it and Unblock the Notifications











