ప్రభాస్ సాహో ట్విట్టర్ రివ్యూ: డై హార్డ్ ఫ్యాన్స్ టాక్ ఏమిటంటే.. ఇంటర్వెల్.. క్లైమాక్స్ పీక్స్
Recommended Video
బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్నసినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా యూవీ క్రియేషన్స్ వారు ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాగా సాహును ఫ్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలాంటి భారీ సినిమాకు కేవలం ఒకే సినిమా అనుభవమున్న సుజీత్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ రోజే (ఆగస్టు 30) సాహో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో యూఎస్ లో ఒకరోజు ముందుగానే షోస్ వేశారు. అక్కడ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు సాహో ఎలా ఉందనే విషయాన్ని తెలుపుతూ ట్వీట్స్ చేశారు. అందులో కొన్ని మీ కోసం..
Read in English: Saaho Twitter Review: Here's What Fans Feel About The Prabhas Starrer
ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది
సాహో ఫస్టాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ అచ్తింగ్ సూపర్. ప్రతీ ఒక్క యాక్షన్ సన్నివేశం అదిరింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్బ్.
సాహో ఫుల్ యాక్షన్.. డార్లింగ్ మాస్ అవతార్
సాహోలో ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ మాస్ అవతార్ కనిపించారు. సుజీత్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాండ్ సూపర్బ్. నటీనటులంతా బాగా నటించారు. శ్రద్ద కపూర్ ఆకట్టుకుంది. ప్రభాస్ మరో స్ట్రాంగ్ మూవీతో వచ్చాడు. 100 %హిట్.
సాహోలో స్క్రీన్ ప్లే, సాంగ్స్ డ్రాబ్యాక్
సాహో ఎక్స్‌గూషన్ అంతగా బాగుందని చెప్పలేం. రొటీన్ గా ఉంది. స్క్రీన్ ప్లే చాలా వీక్ అనిపించింది. సాంగ్స్ లో కూడా స్టఫ్ తేలిపోయింది. సినిమాటోగ్రఫీ ఒక్కటే ఈ సినిమాకు గుడ్ థింగ్. బిలో అవేరేజ్ సినిమా.
మాటల్లో చెప్పలేం.. బ్లాక్ బస్టర్ రైడ్
సాహోలో ప్రభాస్ యాక్షన్ తో చంపేశాడు. మాటల్లో చెప్పలేం.. ఇదో బ్లాక్ బస్టర్ రైడ్. సుజీత్ డైరెక్షన్ మరియు స్క్రీన్ ప్లే సూపర్బ్. ప్రభాస్ సూపర్. బ్యాక్ గ్రౌంగ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసింది.
సాహో చాలా బోరింగ్
సాహో చాలా గ్రేట్ సినిమా అదేవిధంగా చాలా బోరింగ్ గా కూడా ఉంది. చూస్తే ఖచ్చితంగా నిద్ర పోవాల్సిందే. డిసాస్టర్.
సెకండాఫ్ యూస్‌లెస్
సాహో సెకండాఫ్ యూస్‌లెస్. అస్సలు బాగాలేదు. మై రేటింగ్ 2/5.
ఫస్టాఫ్.. ఎంట్రీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్
ఫస్టాఫ్.. ఎంట్రీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. విజువల్స్ హైలైట్. బట్ బిట్ స్లో సాంగ్స్ బాగున్నాయి. గ్రేట్ మూవీ. ఇంటర్వెల్ కి ఉంది అసలైన ట్విస్ట్.
థియేటర్స్ తగలపడిపోవడానికి ఈ షాట్ చాలు
షర్ట్ లెస్ హుజ్ కట్ అవుట్. మాన్స్టర్ బాడీ. ఈ షాట్ ఒక్కటి చాలు థియేటర్ లు తగలపడిపోవడానికి. సాహో సూపర్.
సినిమాని కాపాడింది అంటే సెకండాఫ్
సాహో సినిమాని కాపాడింది అంటే ముఖ్యంగా సెకండాఫ్. ఫస్టాఫ్ ఇంట్రడక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్ ఇంటెన్స్ స్క్రీన్ ప్లే. ఇదో విజువల్ వండర్ అని చెప్పొచ్చు.
వాట్ ఎ ఫిలిం.. మైండ్ బ్లోయింగ్
సాహో.. వాట్ ఎ ఫిలిం.. మైండ్ బ్లోయింగ్ మూవీ. యాక్షన్ సీన్స్ చూసి మైండ్ బ్లోయింగ్ అయింది. గతంలో ఇండియాలో ఎన్నడూ రాని బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ స్పెక్టాక్టుకల్ సినిమా.
ఆసమ్ మూవీ సాహో
సాహో సినిమా మొత్తం చూశా. ఆసమ్ మూవీ.
పాసిటివ్స్
1 . స్క్రీన్ ప్లే
2 . ప్రభాస్, శ్రద్ద కపూర్ యాక్టింగ్
3 . ఇంటర్వెల్ బాంగ్ అండ్ క్లైమాక్స్
4 . ట్విస్ట్స్
5 . వీఎఫ్‌ఎక్స్ అండ్ యాక్షన్ సీన్స్
సుజీత్ స్క్రీన్ ప్లే హైలైట్. సాంగ్స్ అవేరేజ్.

సాహో మూవీ వివరాలు
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది 'సాహో' సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











