Salaar Song: అడవికి రాజంటూ సలార్ టైటిల్ సాంగ్.. తిట్టిపోస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో తెలిసిందే. ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ రాగా.. అభిమానులు మాత్రం చాలా నిరాశచెందారు. సినిమా టీమ్ తీవ్రమైన నెగెటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక ప్రభాస్ తర్వాతి సినిమాలపైనే అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అందులో ఒకటే సలార్ (Salaar). ఇప్పుడు త్వరలో విడుదల కానున్న ఈ సినిమా మేకర్స్ పై ప్రభాస్ అభిమానులు తెగ ఫైర్ అవుతున్నారు. వారు అలా రియాక్ట్ అవ్వడానికి గల కారణాలేంటనే వివరాల్లోకి వెళితే..

Prabhas Salaar Fan Made Title Song Goes Viral And Fans Fires On Makers

డైనోసర్ తో పోలిక: ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సలార్ (Salaar). ఈ సినిమా నుంచి ఇప్పటికీ ఓ పోస్టర్, గ్లింప్స్ వీడియో మాత్రమే విడుదల చేశారు. సీజ్ ఫైర్ అంటూ రిలీజ్ చేసిన 90 సెకన్ల నిడివి గల గ్లింప్స్ లో ప్రభాస్ ను జురాసిక్ పార్కులో డైనోసర్ తో పోలుస్తూ మోస్ట్ వయెలెంట్ మ్యాన్ గా చూపించారు.

Prabhas Salaar Fan Made Title Song Goes Viral And Fans Fires On Makers

రెండోపార్టులోనే: జూలై 6న విడుదలైన సలార్ సీజ్ ఫైర్ వీడియో గ్లింప్స్ అతి తక్కువ సమయంలోనే మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండో పార్టులోనే జగపతి బాబు కనిపించనున్నారని ఇటీవల న్యూస్ వైరల్ అయింది. 'సలార్: సీజ్ ఫైర్' సినిమా విడుదలను భారీగా ప్లాన్ చేశారు మేకర్స్.

Prabhas Salaar Fan Made Title Song Goes Viral And Fans Fires On Makers

1979కి పైగా: సలార్ మూవీని ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో సుమారు 5 వేలకుపైగా లొకేషన్లలో 2డీతోపాటు ఇతర ఫార్మాట్లలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేయనున్నారు. ఓవర్సీజ్ లో ఇలా అతిభారీగా విడుదలయ్యే ఇండియన్ సినిమాగా సలార్ రికార్డుకెక్కింది. ఇక కేవలం నార్త్ అమెరికాలోనే 1979కి పైగా ప్రాంతాల్లో సలార్ రిలీజ్ కానుంది.

Prabhas Salaar Fan Made Title Song Goes Viral And Fans Fires On Makers

అప్డేట్ రాకపోవడంతో: సలార్ సినిమా అమెరికాలో సెప్టెంబర్ 27న ప్రీమియర్ కానుండగా.. ఇండియాలో సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటం, టీజర్ లో ప్రభాస్ ను సరిగ్గా చూపించలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్తా అసహనం వ్యక్తం చేశారు. దీని తర్వాత సాంగ్ రిలీజ్ వంటి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అడవికి రాజు సుల్తాన్: అయితే సలార్ నిర్మాతలపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్న సమయంలో యూట్యూబ్ లో ఓ ఫ్యాన్ మేడ్ టైటిల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అది ఫ్యాన్ మేడ్ సాంగ్ అయినప్పటికీ సినిమా పాటలాగే ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. పాటలో సాహిత్యం, ట్యూన్ వింటే గూస్ బంప్స్ వస్తున్నాయి. 'అడవికి రాజు సుల్తాన్.. సలార్' అంటూ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

మెచ్చుకోవడం ఏంటీ?: వెబ్ సిరీస్ వేవు సమర్పణలో మృదుల మోరా నిర్మించిన సలార్ టైటిల్ లిరికల్ సాంగ్ వీడియో ఇప్పటికీ 10 లక్షలకుపైగా వ్యూస్ తెచ్చుకుంది. పాటను గిరిధర్ రాగోలు రచించి స్వరపరిచారు. సంతోష్ కుమార్ వర్మ, సంగీత్, రాజేష్ లోకనాథం, బాలు భాస్కర్, గిరిధర్ రాగోలు ఆలపించారు. కాగా ఈ పాటను సలార్ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు.

ఫ్యాన్ మేడ్ సాంగ్ అద్భుతంగా ఉందని మేకర్స్ ప్రశంసించారు. సినిమా నుంచి తొలి పాటను రిలీజ్ చేయకుండా ఫ్యాన్ మేడ్ పాటను ఓహో అంటూ మెచ్చుకోవడం ఏంటని డార్లింగ్ అభిమానులు గుస్సా అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X