Salaar Movie: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సలార్.. ప్రీరిలీజ్ బుకింగ్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబోలో తాజాగా రాబోతున్న చిత్రం సలార్. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని తెగ ఇంట్రెస్టింగ్ గా అప్ డేట్లు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే విడుదల అయిన సలార్ ట్రైలర్ కు విశేష స్పందన రాగా.. సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సినిమా మరో రికార్డును క్రియేట్ చేసింది. అసలు ఏ విషయంలో సలార్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ రెబర్ స్టార్ హీరోగా చేస్తున్న ఈ సలార్ చిత్రాన్ని హొంబలే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా కనిపించబోతున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా... దీన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉండబోతుందట. ప్రభాస్, శృతి హాసన్ లు హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన అంటే క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది.

Prabhas Salaar Movie Advance Bookings Create New Records in US Check Details

ఇక అప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎగ్జైటింగ్ గా సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈక్రమంలోనే చిత్రబృందం అమెరికాలో ప్రీరిలీజ్ బుకింగ్స్ ను ప్రారంభించేసింది. మరో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాను చూసేందుకు ఇప్పటి నుంచి టికెట్లు బుక్ చేసుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఉదే విషయాన్ని నేరుగా చిత్రబృందం ఎక్స్ వేధికగా వెల్లడించింది. సినిమా విడుదల కావడానికి ఇంకా తొమ్మిది రోజుల సమయం ఉండగా... ఇప్పటికే అమెరికాలో 650 వేల డాలర్ల మార్కును అందుకున్నట్లు ప్రకటించారు.

సినిమా విడుదల కాకముందే ఈ రేంజ్ లో టికెట్లు బుకింగ్ అవ్వడం చూస్తుంటే.. సినిమా రిలీజ్ అయ్యాక సలార్ హవా ఎలా ఉంటుందో చూడాలి. ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సలార్ సినిమాకు మాత్రమే కాకుండా ఆయనకు గతంలో కూడా ఈ రికార్డును క్రియేట్ చేశాడు. ముఖ్యంగా 500 వేల డారల్ల మార్కును ఇప్పిటకే ఐదు సార్లు దాటాడు. సలార్ సినిమాతో కలుపుకుని ఆయన ఈ రికార్డును క్రియేట్ చేయడం ఇది ఆరోసారి.

Prabhas Salaar Movie Advance Bookings Create New Records in US Check Details

ఇదంతా ఇలా ఉండగా.. అన్ని చిత్రాలలా కాకుండా ఈ సినిమాకు మార్నింగ్ షోస్ తో స్టార్ట్ చేయకుండా ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి 1.30 గంటలకు ఫస్ట్ డే ఫస్ట్ షో రాబోతుందట. అలా అని 22వ తేదీ అర్ధరాత్రి మాత్రం కాదండోయ్.. 21వ తేదీ అర్దరాత్రే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. క్యాలెండర్ లో, వాచ్ లో టైమ్, డేట్ మారుతుంది. కానీ 21వ తేదీ రాత్రే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వేయబోతున్నారు. మీరూ ఈ సినిమాను చూసేందకు రెడీ అయిపోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X