Salaar స్టోరీపై మరో ఆసక్తికరమైన లీక్.. అలా రంగంలోకి దూకే ప్రభాస్ రోల్?
నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరపైకి తీసుకు రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ వరుస పరాజయాలతో ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచాడు. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా నిరాశపరచడం ఒక విధంగా షాక్ కు గురి చేశాయి.
అయినప్పటికీ కూడా ప్రభాస్ రేంజ్ అయితే అసలు తగ్గలేదు. సాహో నుంచి ఆదిపురుష్ వరకు భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమాల కలెక్షన్స్ కూడా హై రేంజ్ లోనే ఉండేవి. అయితే ఇప్పుడు ప్రభాస్ నుంచి రాబోతున్న సలార్ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా మరికొన్ని గంటల్లో విడుదల చేయబోతున్నారు.

అయితే ఇప్పుడే ఈ సినిమా స్టోరీ పై అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. తప్పకుండా ఈ సినిమాకు KGF కథకు లింక్ ఉంటుంది అని ఇదివరకే ఒక టాక్ అయితే వినిపించింది. అయితే ఇప్పుడు మరొక చిన్న స్టోరీ లైన్ లీక్ అయింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఒక గ్యాంగ్ లీడర్ గా ఉండే సలార్ తన స్నేహితుడు చనిపోతే అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఏం చేస్తాడు అనేది ఈ సినిమాలోని అసలు పాయింట్ అని తెలుస్తోంది.
అంటే అంతకుముందే రాకీ భాయ్ కి స్నేహితుడిగా ఉన్న సలార్ అతనికి ఎలాంటి మాట ఇచ్చాడు రాఖీ బాయ్ కోసం అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఏం చేస్తుంది అనే పాయింట్ తో సినిమా కథ కొనసాగుతుందట. ప్రశాంత్ నీల్ యూనివర్స్ తరహాలోనే ఈ సినిమా కథలను కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కథ కూడా దానికి లింక్ అయ్యి ఉంటుందని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











