Salaar: RRR రికార్డు బ్రేక్ చేసిన సలార్.. టాప్ 10లో 3 సినిమాలు ప్రభాస్‌వే?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. ఈ మూవీకి కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు స్నేహితుడి పాత్రలో మరో హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించాడు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే ప్రభాస్.. ఆర్ఆర్ఆర్ రికార్డును కొల్లగొట్టాడు. ఆ వివాల్లోకి వెళితే...

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన యాక్షన్ మూవీ 'సలార్: సీజ్‌ఫైర్' ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజిక్ సమాకూర్చాడు.

Prabhas Salaar Movie Break the Rajamouli RRR Movie record in 4 days Full Details Here

ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం.. కేజీఎఫ్ సిరీసుల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాకు భారీగానే బిజినెస్ నమోదు చేసుకుంది. ఆంధ్రా, నైజం, సీడెడ్ అన్ని కలుపుకుని తెలుగులో ఈ సినిమాకు రూ. 120 కోట్లు బిజినెస్ జరుపుకుంది. ఇక కర్నాటక, తమిళనాడు, హిందీ, రెస్టాఫ్ ఇండియా, కేరళ, ఓవర్సీస్‌ అంతా కలుపుకుని ఈ సినిమాకు రూ. 345 కోట్లు బిజినెస్ నమోదు అయింది.

సలార్: సీజ్‌ఫైర్' నాలుగో రోజు తెలుగులో భారీ వసూళ్లు సాధించిందని లెక్కలు చూస్తుంటే తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమా నాలుగో రోజు రూ. 18.05 కోట్లు షేర్, రూ. 28.45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇక నాలుగు రోజుల్లో తెలుగులో ఈ సినిమా రూ. 111.97 కోట్లు షేర్, రూ. 168.78 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

Prabhas Salaar Movie Break the Rajamouli RRR Movie record in 4 days Full Details Here

ప్రపంచ వ్యాప్తంగా సలార్: సీజ్‌ఫైర్' 4 రోజుల్లో తెలుగు, తమిళ్, కర్ణాటక, కేరళ, హిందీ, ఓవర్సీస్ కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా రూ. 222.17 కోట్లు షేర్, రూ. 450 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక సలార్ సినిమా రూ. 345 కోట్ల బిజినెస్ జరుపుకోగా... అంటే రూ. 347 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది. అయితే 4 రోజుల్లో దీనికి రూ. 222.17 కోట్లు షేర్ రాగా.. ఈ సినిమా హిట్ అవ్వాలంటే... రూ. 124.83 కోట్లు రాబట్టాలి.

ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసిందని తెలుస్తోంది. సలార్ తెలుగులో నాలుగోరోజు 18.05 కోట్లు రాబట్టగా.. ఆర్ఆర్ఆర్ సినిమా నాలుగో రోజు రూ.17.73 రాబట్టింది. దీంతో ఆర్ఆర్ఆర్ రికార్డును సలార్ బ్రేక్ చేసినట్లు అయింది. ఇక ఈ సినిమా తర్వాత నాలుగో రోజు రికార్డు వసూళ్లతో బహుబలి 2 రూ.14.65 కోట్లు, ఆ తర్వాత సర్కారి వారి పాట రూ.12.06 కోట్లు రాబట్టింది.

అలా వైకుంఠపురంలో రూ. 11.56 కోట్లు, వాల్తేరు వీరయ్య రూ.11.42 కోట్లు, కేజీఎఫ్ 2 రూ.10.81 కోట్లు, సాహో రూ.9.60 కోట్లు, సరిలేరు నీకెవ్వరు రూ.8.67 కోట్లు, మహర్షి రూ. 8.44 కోట్లు, అఖండ 8.31 కోట్లు రాబట్టింది. ఇక టాప్ 10 సినిమాల్లో మూడు సినిమాలు ప్రభాస్ వే ఉండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X