Salaar Release: సలార్ రిలీజ్ అయ్యేది ఆరోజే.. కానీ ఉదయం మాత్రం కాదట.. మరి ఎప్పటి నుంచంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం సలార్. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కోసం అభిమానులు అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ముందు నుంచి ఫుల్ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా సలార్ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ లకు విపరీతమైన స్పందన వచ్చింది. వారం రోజుల క్రితం విడుదల అయిన ట్రైలర్ అయితే యూట్యూబ్ ను షేక్ చేసింది.

ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇక అప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎగ్జైటింగ్ గా సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈక్రమంలోనే చిత్ర బృందం సలార్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. అయితే ఆ సర్ ప్రైజ్ ఏంటి.. అది అభిమానులను ఫుల్ గా అలరిస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Prabhas Salaar Movie First Day First Show Time And Date Fixed Check Details

యంగ్ రెబర్ స్టార్ హీరోగా చేస్తున్న ఈ సలార్ చిత్రాన్ని హొంబలే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా కనిపించబోతున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా... దీన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. పార్ట్ 1 నే దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.

అన్ని చిత్రాల్లాగే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే... అన్ని చిత్రాలలా కాకుండా ఈ సినిమాకు మార్నింగ్ షోస్ తో స్టార్ట్ చేయట్లేదని తెలిపింది. అర్ధరాత్రి 1.30 గంటలకు ఫస్ట్ డే ఫస్ట్ షో రాబోతుందట. అలా అని 22వ తేదీ అర్ధరాత్రి మాత్రం కాదండోయ్.. 21వ తేదీ అర్దరాత్రే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. క్యాలెండర్ లో, వాచ్ లో టైమ్, డేట్ మారుతుంది. కానీ 21వ తేదీ రాత్రే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వేయబోతున్నారు.

Prabhas Salaar Movie First Day First Show Time And Date Fixed Check Details

మరి అర్ధరాత్రుల్లు తొలి షో వస్తుండగా... ఎంత మంది ఈ షోను చూసేందుకు నిద్రలేని రాత్రులు గడుపుతారనేది చూడాలి. ఇప్పటికే ఎంతో కాలంగా ప్రభాస్ సినిమా కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్.. కచ్చితంగా రాత్రిళ్లు అయినా సరే వెళ్తారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X