Salaar: ప్రభాస్ ప్రభంజనం.. రిలీజుకుముందే RRR రికార్డ్ బ్రేక్.. డార్లింగ్ బర్త్ డేతో క్రేజీగా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో తెలిసిందే. ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ రాగా.. ఫ్యాన్స్ మాత్రం చాలా నిరాశచెందారు. సినిమాపై తీవ్రమైన నెగెటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ప్రభాస్ తర్వాతి సినిమాలపైనే అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. డార్లింగ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో సలార్ (Salaar) ఒకటి. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం క్రియేట్ చేసింది. అదేంటనే విషయంలోకి వెళితే..

ప్రశాంత్ నీల్ డైరెక్షన్:బాహుబలి సినిమాతో ఊహించని క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన డార్లింగ్.. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ (Salaar) ఒకటి.

Prabhas Salaar Movie Released In 1979 North America Locations And US Premiere On September 27

మిలియన్ల వ్యూస్:జూలై 6న సలార్ సీజ్ ఫైర్ అంటూ వదిలిన 90 సెకన్ల నిడివి గల గ్లింప్స్ తో అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ ను జురాసిక్ పార్కులో డైనోసర్ తో పోలుస్తూ మోస్ట్ వయెలెంట్ మ్యాన్ గా చూపించారు. ఇది అతి తక్కువ సమయంలోనే మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సలార్ మూవీ రిలీజుకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Prabhas Salaar Movie Released In 1979 North America Locations And US Premiere On September 27

ఇండియన్ సినిమాగా:సలార్ సినిమా విడుదలను భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. సలార్ మూవీని ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో సుమారు 5 వేలకుపైగా లొకేషన్లలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేయనున్నారు. ఓవర్సీజ్ లో ఇలా అతిభారీగా విడుదలయ్యే ఇండియన్ సినిమాగా సలార్ రికార్డుకెక్కింది.

Prabhas Salaar Movie Released In 1979 North America Locations And US Premiere On September 27

5వేలకుపైగా:ప్రభాస్ సలార్ సినిమాను 5 వేలకు పైగా లొకేషన్లలో 2డీతోపాటు ఇతర ఫార్మాట్లలో కూడా రిలీజ్ చేయనున్నారట. ఇక కేవలం నార్త్ అమెరికాలోనే 1979కి పైగా ప్రాంతాల్లో సలార్ రిలీజ్ కానుంది. ఇండియన్ సినిమా చరిత్రలో నార్త్ అమెరికాలో ఇలా రిలీజ్ కావడం ఇదే తొలిసారట. ఇది RRR సినిమా కంటే ఎక్కువ అని విశ్లేషకులు అంటున్నారు. అంటే RRR రికార్డును రిలీజుకు ముందే సలార్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.

పుట్టినరోజుతో:సలార్ మూవీని నార్త్ అమెరికాలో 1979కిపైగా లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన పోస్టర్ ఆసక్తిగా మారింది. ఈ 1979కి సలార్ కథకు ఏదో కనెక్షన్ ఉందని, లేదా ప్రభాస్ పుట్టిన సంవత్సరం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదివరకు కేజీఎఫ్ లో యశ్ బ్రాండ్ గురించి సిన్స్ 1951 అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక సలార్ సినిమా అమెరికాలో సెప్టెంబర్ 27న ప్రీమియర్ కానుండగా.. ఇండియాలో సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X