Salaar: తెలుగు రాష్ట్రాల్లో ఊహించని డిమాండ్.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సలార్. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని సుమారు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారు. ఇందులో భాగంగా సలార్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నారు.
కేజీఎఫ్ సిరీస్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఆదిపురుష్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే సలార్ బిజినెస్ వేల్యూ మరింత పెరిగిపోతోంది. సలార్ మూవీకి ఇప్పటికే డిస్టిబ్యూటర్స్ నుంచి భారీ రైట్స్ కోసం భారీగా ఆఫర్ చేస్తున్నారంట.

ఆంధ్రా హక్కుల కోసం వంద కోట్లు ఇవ్వడానికి రెడీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నైజాం ఏరియాలో 75 కోట్లకి హక్కుల కోసం ఇవ్వడానికి డిస్టిబ్యూటర్స్ ముందుకొచ్చారని తెలుస్తోంది. ఇక సీడెడ్ లో 40 కోట్ల ఆఫర్ బళ్ళారి సాయి నుంచి ఆఫర్ నిర్మాతలకి అందిందంట. అయితే విజయ్ కిరంగదూర్ మాత్రం సలార్ సినిమాని సొంతంగానే రిలీజ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారంట.
మొత్తం కేవలం తెలుగు రాష్ట్రాలలోనే 214 కోట్ల వరకు సలార్ సినిమాపై రైట్స్ కోసం ఆఫర్ వచ్చినట్లు టాక్. ఓ విధంగా టాలీవుడ్ హిస్టరీలోనే ఇది అతి పెద్ద డీల్ అని చెప్పొచ్చు. అయితే సలార్ నుంచి 600 కోట్ల వరకు అన్ని భాషలలో కలిపి వ్యాపారం జరుగుతుందని నిర్మాత ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అలాగే బాహుబలి 2 కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో సలార్ టీజర్ రిలీజ్ అయితే మరింతగా హైప్ క్రియేట్ కావడంతో కోట్ చేసే రెట్లు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే ఓవరాల్ గా అన్ని స్టేట్స్ తో బయ్యర్లకి ఇచ్చేసి సొంతంగా రిలీజ్ చేసే ఆలోచనలోనే విజయ్ కిరంగదూర్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఎంత వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











