Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్‌పై వేటు!
- Lifestyle మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్‌లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్‌జున్‌వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
Salaar Release Date: స్టన్నింగ్ పోస్టర్‌తో సర్ప్రైజ్.. సలార్ రిలీజ్ ఎప్పుడంటే!
సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంతో సినిమాల్లోకి హీరోగా పరిచయమైనా.. కెరీర్ ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ టాలెంటెడ్ హీరో.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. దీంతో పంథాను మార్చుకున్న ఈ స్టార్ హీరో.. అప్పటి నుంచి రెట్టించిన జోష్‌తో వరుసగా ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ దూసుకెళ్తోన్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.
ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది
ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నాలుగైదు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'సలార్' ఒకటి. ఈ చిత్రాన్ని 'కేజీఎఫ్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందించి.. దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది ప్రారంభంలోనే మొదలైన ఈ చిత్ర షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేశారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన రెండో షెడ్యూల్లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను కూడా తీశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న 'సలార్' మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ 40 శాతం వరకూ కంప్లీట్ అయింది. ఈ క్రమంలోనే మిగిలిన భాగానికి చేయాల్సిన షూట్‌ను కూడా మంచిగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రీకరణ ఆలస్యం అవుతోంది. దీంతో ఈ సినిమా విడుదలపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఈ మూవీ ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు లేవన్న టాక్ కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా సలార్ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం
వాస్తవానికి ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'సలార్' మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అప్పట్లో ప్రకటించింది. అయితే, షూటింగ్ ఆలస్యం అవడంతో అప్పుడు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2028 సెప్టెబర్ 28న విడుదల చేస్తున్నట్లు సలార్ టీమ్ అనౌన్స్ చేసింది. అంటే ఈ సినిమా రావడానికి మరో 13 నెలల సమయం ఉందన్న మాట. ఇక, ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ రెండు చేతులతో కత్తులు పట్టుకుని దండయాత్ర చేస్తున్నట్లు చూపించారు. దీంతో ఈ హై ఓల్టేజ్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది.
'సలార్' మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.