Salaar Vs Devara ప్రభాస్‌తో పోటీకి జూనియర్ ఎన్టీఆర్.. సలార్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబోలో తాజాగా రాబోతున్న చిత్రం సలార్. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కోసం తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటు ప్రభాస్, ఇటు ప్రశాంత్ నీల్ అభిమానులు. అయితే ఇటీవలే ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎగ్జైటింగ్ గా సినిమా కోసం వేచి చూస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉందని అందరికీ తెలిసిందే.
అయితే పార్ట్ 1 విడుదల అయిన కొంత కాలానికే పార్ట్ 2 కూడా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మరీ ఎక్కువ కాలం గ్యాప్ తీసుకోకుండా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే వచ్చే ఏడాది వేసవి సెలవులు అంటే 2024 ఏప్రిల్ నెలలో సలార్ పార్ట్ 2 ను విడుదల చేయాలని చిత్రబృదం అనుకుంటుందట. ఇప్పటికీ ఏప్రిల్ నెలలో ఓ తేదీని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఆ సమయంలోనే కచ్చితంగా పార్ట్ 2 రిలీజ్ అయితే కొన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా పార్ట్ 2 ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో గనుక విడుదల చేస్తే... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడాల్సి వస్తుంది. ఎందుకు అంటే తారక్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర సినిమా కూడా అప్పుడే విడుదల కాబోతుంది. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ చిత్రంలో తారక్ సరసన ఆడి పాడబోతుంది. ఈ సినిమాపై కూడా భారీ ఎత్తునే అంచనాలు ఉన్నాయి. రెండు పెద్ద స్టార్ హీరోల చిత్రాలు.. ఒకేసారి విడుదల అయితే బాక్సాఫీసు వద్ద భారీగా తేడాలు వస్తాయని అంతా అనుకుంటున్నారు. ఇలా క్లాష్ కావడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ చేయకపోతేనే బాగుంటుందని సినీ విశ్లేషకులు వివరిస్తున్నారు.
ముఖ్యంగా సలార్ పార్ట్ 1 ను.. బాలీవుడ్ బాద్ షా డుంకీ చిత్రం రిలీజ్ సమయంలోనే విడుదల చేస్తుండడంతో రెండింటి మధ్య పోటీ ఏర్పడింది. ముందుగా ఈ సినిమాల విడుదల తేదీలు ప్రకటించగా... రెండు ఒకేసారే రిలీజ్ చేయకపోవడం మంచిది అని అంతా అనుకున్నారు. కానీ అటు సలార్ టీం కానీ అటు డుంకీ టీం కాని వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ రెండు చిత్రాలు ఒకేసారి బరిలో దిగుతున్నాయి.

అలాగే పార్ట్ - 2 రిలీజ్ లో కూడా ఇదే జరుగుతుంది. కానీ ఈ రెండు సినిమాలు తెలుగు వాళ్లు ఎక్కువగా చూస్తారు కాబట్టి విడుదల చేయకూడదని.. కోరుకుంటున్నారు. అయితే పార్ట్ 1 ఎండింగ్ లో పార్ట్ 2 రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారట. సలార్ 2 షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











