Salaar 2 లో విలన్‌గా మరో యంగ్ హీరో.. ఆ సీన్లతో సలార్ 1 ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే?
దివంగత కష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ ఎదిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ తన అభిమానులను సలార్ మూవీ ద్వారా అలరించేందకు రెడీ అయ్యాడు. దీనికోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ పార్ట్ 1, సలార్ 2 సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ బయటకు వచ్చాయి.
భారీ బడ్జెట్ చిత్రాలు: బాహుబలి సినిమాతో ఊహించని క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు డార్లింగ్ ప్రభాస్. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ (Salaar) ఒకటి.

భారీ స్థాయిలో రిలీజ్: ఇప్పటికీ సలార్ నుంచి విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే 90 సెకన్ల వీడియో గ్లింప్స్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో ప్రభాస్ ను జురాసిక్ పార్కులో డైనోసర్ తో పోలుస్తూ మోస్ట్ వయెలెంట్ మ్యాన్ గా చూపించారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది. అలాగే అభిమానులు కూడా తెగ సంబరపడ్డారు. ఇదే కాకుండా సలార్ ను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

రెండు పార్టులుగా: సలార్ మూవీని ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో సుమారు 5 వేలకుపైగా లొకేషన్లలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీషు భాషల్లో 2Dతోపాటు ఇతర విధానాల్లో సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. ఇక కేవలం నార్త్ అమెరికాలోనే 1979కి పైగా ప్రాంతాల్లో సలార్ రిలీజ్ కానుంది. అయితే సలార్ రెండు పార్టులుగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
ట్రైలర్ అలా: సలార్ సీజ్ ఫైర్ (Salaar: Part 1 Ceasefire)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పెద్దగా ప్రమోషన్స్ చేయాల్సిన పని లేదు. ఇక సలార్ 1 (Salaar 1 Trailer) ట్రైలర్ ను రెడు మూడు వారాల్లో విడుదల చేయనున్నారట. టీజర్ లో చూపించినట్లుగానే సలార్ పార్ట్ 1 ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్, హై ఎలివేషన్స్ చూపించనున్నారట. కానీ, కథను పెద్దగా రివీల్ చేసే అవకాశం లేదని టాక్.

డిసెంబర్ నుంచి: ఇక సలార్ 2 (Salaar 2) కోసం ఒక యంగ్ హీరోను విలన్ గా దాదాపుగా ఖరారు చేశారని సమాచారం. సలార్ సెకండ్ పార్టులో (Salaar Part 2) అతనే మెయిన్ అండ్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడట. దీనికి సంబంధించిన షూటింగ్ ను డిసెంబర్ ప్రారంభించే అవకాశం ఉందని టాక్. అయితే సలార్ పార్ట్ 1లో విలన్ గా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రెండో పార్టులో జగపతి బాబు కూడా కీ రోల్ పోషించనున్నారు.


Click it and Unblock the Notifications











