‘సలార్’ రెండో షెడ్యూల్‌లో పెద్ద ప్రభాస్: దాని కోసం ప్లాన్ మార్చిన ప్రశాంత్ నీల్

టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. 'కేజీఎఫ్' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీని రూపొందించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కొంత వరకూ పూర్తైంది. రెండో షెడ్యూల్ ప్రారంభానికి కరోనా సెకెండ్ వేవ్ అడ్డం రావడంతో దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో ఈ మూవీ షూటింగ్‌ను షురూ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది.

ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' అనే బాలీవుడ్ చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. దీనితో పాటు 'సలార్' షూటింగ్‌లోనూ పాల్గొనబోతున్నాడు. యంగ్ రెబెల్ స్టార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రశాంత్ నీల్ తన ప్లాన్‌ను మార్చుకున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. 'సలార్' మూవీ కోసం ప్రభాస్ యంగ్ లుక్‌లో ట్రిమ్ షేవ్‌తో షూట్ చేయాలని భావించారట.

Prabhas Salaar Plan Change for Adipurush

అయితే, 'ఆదిపురుష్' కోసం అతడు కోరమీసంతో కనిపించాల్సి ఉంది. సో.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్లాన్‌లో మార్పులు చేసి.. ముందుగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను చిత్రీకరించబోతున్నాడని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ మరో పాత్ర కోసం కోరమీసంతో కనిపించబోతున్నాడు. దీన్ని అలా కవర్ చేయబోతున్నారట.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X