Salaar మూవీ నుంచి అదిరిపోయే గిఫ్ట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా!
కొంత కాలంగా తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ హాట్ టాపిక్ అవుతోన్న స్టార్ హీరోల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి టాలీవుడ్ మూవీలకే పరిమితం అయిన అతడు.. టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' విజయం తర్వాత నుంచి పంథాను మార్చుకున్నాడు. ఈ చిత్రంతో ప్రపంచానికి పరిచయం అయిన ఈ స్టార్ హీరో.. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. దీంతో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక, ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.
రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే 'రాధే శ్యామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాధాకృష్ణ కుమార్ రూపొందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మించారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను చేశాడు. జస్టిన్ ప్రభాకరణ్ దీనికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్‌కు నిరాశనే మిగిల్చింది. ఫుల్ రన్‌లో కేవలం రూ. 83 కోట్లు వరకే వసూలు చేసి.. ఏకంగా రూ. 120 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. ఫలితంగా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో 'సలార్' ఒకటి. దీన్ని 'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించిన ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ మూవీ షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో కంప్లీట్ చేసుకుంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేశారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెండోది కూడా మొదలైంది. ఈ షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో కొన్ని షెడ్యూళ్లను జరిపించారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీకి సంబంధించిన రెండో షెడ్యూల్‌ను గుజరాత్‌లో ప్లాన్ చేసుకున్నా.. కోవిడ్ నిబంధనల కారణంగా దాన్ని హైదరాబాద్‌కు షిప్ట్ చేశారు. ఇక, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. అంతకంటే ముందే ఈ చిత్రం నుంచి ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇవ్వాలని అనుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే ప్రభాస్ సలార్ మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోను విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన కేజీఎఫ్ విడుదల తర్వాత ఇవ్వబోతున్నారట. అనంతరం దీన్ని రిలీజ్ చేస్తారని తెలిసింది. ఇందులో ప్రభాస్ అభిమానులు ఖుషీ అయ్యే ఎలివేషన్‌ను చూపించబోతున్నారని తెలిసింది.
'సలార్' మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











