ప్రభాస్ కొత్త సినిమాపై కరోనా ఎఫెక్ట్: ఎదురెళ్లేందుకు రెడీ అవుతోన్న ‘సలార్’ టీమ్

కెరీర్ ఆరంభంలో చిన్న చిత్రాల్లో నటించి.. దర్శకధీరుడుర రాజమౌళి తీసిన 'బాహుబలి' సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కొంత కాలంగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడతను. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాను చేస్తున్న ప్రభాస్.. అది పట్టాలపై ఉండగానే జెట్ స్పీడుతో వరుస పెట్టి ఎన్నో చిత్రాలను ప్రకటించాడు. అందులో 'సలార్' అనే సినిమా ఒకటి. మాఫియా బ్యాగ్ డ్రాప్‌తో రూపొందనున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

KGF వంటి మాస్ ఎంటర్‌టైనర్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం అతడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి చేస్తున్న చిత్రమే 'సలార్'. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం యూనిట్ త్వరలోనే గుజరాత్ వెళ్లబోతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఓ సెట్ ఏర్పాటు చేయగా.. ఏప్రిల్ మూడో వారం నుంచి అక్కడ షూట్ జరగనుందని తెలిసింది. అయితే, ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో షూటింగ్‌కు పర్మీషన్ వచ్చే అవకాశాలు లేవన్న టాక్ వినిపిస్తోంది.

Prabhas Salaar Team Will Go to Gujarath

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్‌లతో కనిపిస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ గోదావరిఖనిలోని బొగ్గు గనుల్లో విజయవంతంగా పూర్తయింది. అక్కడ హీరో ఇంట్రడక్షన్ సీన్లతో పాటు ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X