Prabhas Salaar Teaser Review: జురాసిక్ పార్క్ అంటూ సలార్ రచ్చ.. టీజర్‌కే ఓ రేంజ్ బిల్డప్
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సలార్ టీజర్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజీఎఫ్ క్లైమాక్స్ సీన్ రిలేట్ చేస్తూ ఈ సినిమా టీజర్‌ను జూలై 6వ తేదీ ఉదయం 5.16 గంటలకు రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ టీజర్ మ్యాజిక్ మీరే చూడండి..
సలార్ టీజర్‌లో టీనూ ఆనంద్‌కు వందలాది మంది గన్స్ గురిపెట్టి కాల్చేందుకు ప్రయత్నిస్తుంటారు. దాంతో సింపుల్ ఇంగ్లీష్.. నో కన్‌ఫ్యూజన్ అంటూ ఆయన కథ చెప్పడం ప్రారంభిస్తాడు. అడవుల్లో చిరుతపులులు, టైగర్స్, ఎలిఫెంట్స్ చాలా డేంజరస్. వేరి డేంజరస్. కానీ అవి జురాసిక్ పార్క్‌లో కాదు డేంజరస్ కాదు. ఎందుకంటే ఆ పార్క్‌లో ఒకడు ఉంటాడు.. వాడే అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను చూపిస్తారు. ప్రభాస్‌తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కనిపించాడు.
సలార్ టీజర్ పూర్తిగా యాక్షన్ పార్ట్‌తో నింపేశాడు. టీజర్ కోసం వాడిన కలర్ టింట్ కేజీఎఫ్‌ను గుర్తుకు తెచ్చింది. మాస్ ఎలిమెంట్స్, బిల్డప్ షాట్స్‌తో ప్రశాంత్ నీల్ మరోసారి మాయ చేసేందుకు ప్రయత్నించాడు. ఫైట్స్, యాక్షన్ మూమెంట్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సలార్ సినిమాను రెండు పార్టులుగా ఉంటుందని టీజర్‌లో సిగ్నల్ ఇచ్చేశాడు. మొదటి భాగానికి సలార్ పార్ట్ 1 సీస్‌ఫైర్ అంటూ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను కేజీఎఫ్, కాంతారా నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు.

ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమార్, శృతిహాసన్, టిను ఆనంద్, జగపతిబాబు, శ్రీయారెడ్డి, గరుడ రామ్ నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రఫి, రవి బస్రూర్ సంగీతం, అంబరివు స్టంట్స్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











