సలార్ KGF కు ఊహించని లింక్.. ఆ సమయంతోనే అసలు ట్విస్ట్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ సినిమా ద్వారా మరో డిజాస్టర్ ఎదురుకోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం ఫ్యాన్స్ హోప్స్ ఎక్కువగా అయితే సలార్ సినిమా పైనే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ఫ్యాన్స్ ఎంతో గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ కూడా ఇవ్వడంతో బజ్ అయితే గట్టిగానే పెరుగుతుంది.
ఈ నెల 6వ తేదీన 5:12 గంటలకు టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సమయానికి అలాగే కేజిఎఫ్ కు లింకు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఫ్యాన్స్ హడావిడి చేయడం మొదలుపెట్టేశారు. అసలైతే సలార్ సినిమాకు కేజీఎఫ్ సినిమాకు లింకు ఉంది అని ఈ సినిమాను దర్శకుడు యూనివర్స్ తరహాలో తెరపైకి తీసుకురాబోతున్నాడు అని గతంలో అనేక రకాల కథనాలు అయితే వెలువడ్డాయి.

అయితే చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ఈ విషయంలో అధికారికంగా అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు టీజర్ రిలీజ్ చేస్తున్న టైం కి అలాగే కేజిఎఫ్ పార్ట్ 2 క్లైమాక్స్ కు చాలా పెద్ద లింకు ఉంది అని ఊహించుకుంటున్నారు. ఎందుకంటే రాఖీ బాయ్ పై చివరలో ఎటాక్ కూడా దాదాపు అదే సమయంలో జరుగుతుంది. ఇక రాఖీపై కరెక్టుగా 5:12 కి సముద్రంలోకి పడిపోతాడు అని ఆ తర్వాత సలార్ కథ మొదలవుతుంది అని ఇప్పుడు ఎవరికి వారే ఊహించేసుకుంటున్నారు. క్లయిమాక్స్ లో గడియారాలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కు వైరల్ చేస్తున్నారు.
మరి ఈ లింక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. మరి ప్రభాస్ ఈ సినిమాతో అయినా తన వరుస డిజాస్టర్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











