ప్రభాస్ మిమ్మల్నే నేరుగా కలుస్తాడట.. ఆ ఛాన్స్ మీకే దక్కొచ్చు.. వెంటనే ఇలా చేసేయండి
ప్రభాస్ తన అభిమానులను నేరుగా కలుస్తా అని చెబుతున్నాడు. సాహో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మాట చెప్పిన ఆయన.. దానికి ఓ కండీషన్ పెట్టారు. తాను చెప్పినట్లు చేస్తే నేరుగా మిమ్మల్ని కలిసి ముచ్చటిస్తా అని వీడియో ద్వారా తెలిపారు ప్రభాస్.
ఈ వీడియోలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. ''హాయ్ డార్లింగ్స్.. నన్ను కలవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సాహో పోస్టర్ తో ఓ సెల్ఫీ దిగి నాకు ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా ట్యాగ్ చేయండి. అందులో కొందరిని నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసి కలుస్తా'' అని చెప్పారు. దీంతో వెంటనే ప్రభాస్ అభిమానులంతా ఆ పనిలో పడిపోయారు. సరికొత్తగా అనిపించేలా ప్రభాస్ చేస్తున్న ఈ ప్రమోషన్స్ సినీ లోకాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ప్రభాస్ సాహో విషయానికొస్తే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.

ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సాహో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఆగస్టు 30 వ తేదీన ఈ విడుదల కానుంది. నాలుగు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











