నేనైతే బందీనయ్యా.. మీరంతా కూడా అదే చేస్తారనుకుంటున్నా: ప్రభాస్
దేశంలోని ప్రజలను కరోనా వైరస్ గడగలాడిస్తోంది. కంటికి కనిపించకుండా చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో రద్దీ ప్రదేశాలకు వెళ్ళకపోవడం, సామాజిక దూరం పాటించడమే ఉత్తమమైన మార్గమని డిసైడ్ అవుతున్నారంతా. ఈ మేరకు ఇప్పటికే చాలా మంది సినీ తారలు సెల్ఫ్ క్వారంటైన్ (స్వీయ నిర్బంధం) విదించుకున్నారు.
తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాను స్వీయ నిర్బంధం విధించుకున్నానని, మీరంతా కూడా కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటారని భావిస్తున్నానని పేర్కొంటూ సందేశం పోస్ట్ చేశారు ప్రభాస్. ఇది చుసినప్రభాస్ అభిమానులు వీ కెన్ ఆల్సో (మేము కూడా మీ బాటలోనే) అంటూ రియాక్ట్ అవుతున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో భాగమవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తిచేసుకున్న చిత్రయూనిట్ తిరిగి ఇండియా చేరుకుంది. అప్పటి నుంచి ప్రభాస్, పూజా హెగ్డే బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఈ విషయాన్ని ఇప్పటికే పూజా ప్రకటించగా, తాజాగా ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











