ప్రభాస్, శ్రద్ద రొమాంటిక్ డోస్.. కాపీ కొట్టారంటూ రెబల్ స్టార్ యాంటీ ఫ్యాన్స్ హల్చల్
బాహుబలి సినిమా తర్వాత 'సాహో' రూపంలో మరో భారీ రేంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30 వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ప్రభాస్, శ్రద్దలతో కూడిన ఓ రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే దీనిపై ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. వివరాల్లోకి పోతే..

ప్రభాస్, శ్రద్ద కపూర్ రొమాంటిక్ స్టిల్
రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ద కపూర్ రొమాంటిక్ స్టిల్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిత్రయూనిట్ అఫీషియల్‌గా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఒడిలో శ్రద్ద కపూర్ కూర్చొని ఉండగా ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు హీరో. ఈ పోస్టర్‌లో రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉండటంతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఇట్టే వైరల్ అయిపోయింది.

అచ్చం రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యారాయ్ లాగే
దీంతో ప్రభాస్, శ్రద్ద కపూర్ రొమాంటిక్ స్టిల్‌తో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యారాయ్‌ల పోస్టర్ ఒకటి కంపేర్ చేస్తూ రంగంలోకి దిగారు ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఈ రెండు ఫోటోలను పక్కపక్కనే ఉంచి పోల్చుతూ ప్రభాస్, శ్రద్ద కాపీ కొట్టారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.

భారీ రేంజ్ సినిమా.. హై ఎక్స్‌పెక్టేషన్స్
ప్రభాస్ కెరీర్ లో భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా 'సాహో' రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్ద కపూర్ ఇద్దరూ యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశారని తెలుస్తోంది. దేశ విదేశాల్లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ తెలుగు ప్రేక్షకులను మునుపెన్నడూ లేని విధంగా థ్రిల్ చేయనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

సాహో మూవీ
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి సాహో సినిమా తెరకెక్కించారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











