రాజమౌళి మహాభారతంలో ప్రభాస్.. క్యారెక్టర్ కూడా చెప్పేశారు

ఆగస్టు చివర్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పండుగ రాబోతోంది. అదేనండీ సాహో సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మీడియా సమావేశాలు, పబ్లిక్ మీట్స్ అంటూ దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాడు ప్రభాస్. ఇందులో భాగంగా ప్రభాస్‌కి మహాభారతం సినిమాకు సంబందించిన ప్రశ్నలు ఎదురుకావడంతో తన ఆసక్తి ఏంటనేది వెల్లడించాడు.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మహాభారతాన్ని సినిమా రూపంలో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లుగా గతంలో వెల్లడించారు. ఒకవేళ మహాభారతానికి వెండితెర రూపం ఇస్తే.. కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ద్రౌపది, భీముడు సహా పలు పాత్రలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ పాత్రల్లో ఎవరు నటిస్తారనే దానిపై క్యూరియాసిటీ మొదలైంది జనాల్లో.

Prabhas Special interest On Mahabharatham

ఈ నేపథ్యంలోనే తాజాగా సాహో ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరులోని మీడియా ప్రతినిథులు మహాభారతంలో నటించే అవకాశం వస్తే ఏ పాత్రలో నటిస్తారని ప్రభాస్ ని ప్రశ్నించారు. దానికి బదులిచ్చిన ప్రభాస్.. అర్జునుడు పాత్ర చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో మాహాభారతం సినిమా విషయమై చర్చలు ముదిరాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రకటించే అవకాశం కూడా ఉండొచ్చు అని అంటున్నారు కొందరు. చూడాలి మరి ఏం జరుగుతుందో!

ఇక ప్రభాస్ సాహో విషయానికొస్తే.. భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ఆగస్టు 30 వ తేదీన విడుదలకానుంది సాహో. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందించబడిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X