Don't Miss!
- News
నేడు బీఆర్ఎస్ లో భారీ చేరికలు -కేసీఆర్ తో వరుస భేటీలు..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆగిపోయిన ప్రభాస్ కొత్త సినిమా: ఫ్యాన్స్ కోసం రెబెల్ స్టార్ కీలక నిర్ణయం
ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంటరైనా.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ప్రభాస్. అలా సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన అతడు.. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో అప్పటి నుంచి భారీ చిత్రాలనే చేస్తూ సత్తా చాటుతోన్నాడు. ఇలా ఇప్పటికే రెబెల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే భారీ చిత్రాలు చేస్తోన్నాడు.
తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!
ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 17వ తేదీ జరిగాయి. ఆ వెంటనే ఓ భారీ బంగ్లా సెట్‌ను రూపొందించిన చిత్ర యూనిట్ మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించింది. దీనికి సంబంధించిన పిక్ కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమా చాలా షూటింగ్ జరుపుకుంది. అయితే, ఇప్పుడీ మూవీ ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. 'సలార్'తో పాటు 'ప్రాజెక్టు K' చిత్రాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకనే ఈ సినిమాను ఆపేసినట్లు కూడా ఓ టాక్ వినిపిస్తోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీ మాత్రం ఆగిపోలేదట. ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా మారుతి చిత్రానికి కూడా డేట్స్ ఇచ్చేలా ప్రభాస్ ప్లాన్లు చేసుకున్నాడట. అంటే.. ఆ రెండు చిత్రాలు పూర్తి అయినా అవకపోయినా ఇది మాత్రం కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది.
Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. ఇక, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.