Radhe shyam Event: సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి.. వారి వల్లే మూవీ సాధ్యమైంది: ప్రభాస్

యు.వి.క్రియేషన్స్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరపైకి రాబోతున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. అయితే నేడు చిత్ర యూనిట్ సభ్యులు రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. కృష్ణంరాజు కూడా ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఇక ఆయన ఈ సినిమాలో పరమహంస అనే ఒక ఆధ్యాత్మిక గురువు గా కనిపించబోతున్నారు. ఇక ఈ వేడుకలో ప్రభాస్ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నారు.

దేవుడిలా ఉన్నారు

దేవుడిలా ఉన్నారు

ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ ను అభిమానులు అందరూ కూడా లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా కాలం తర్వాత ఈ వేడుక ద్వారా మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీ గా అనిపిస్తోంది. పెదనాన్నగారు కూడా ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. ఆయన ఒక దేవుడు లాగా కనిపిస్తున్నారు. అభిమానులందరికి ఈ సినిమా నచ్చుతుంది. గోపి కృష్ణ యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.

 లవ్ స్టోరీ మాత్రమే కాదు

లవ్ స్టోరీ మాత్రమే కాదు

అయితే ఈ సినిమాని మొదట గోపికృష్ణ బ్యానర్ లో తెరపైకి తీసుకురావాలని అనుకున్నప్పుడు చాలా ఆలోచించడం జరిగింది. బిల్లా తరువాత మళ్ళీ మంచి సినిమా చేయాలని చాలా ఆలోచింది ఈ బ్యానర్ లో చేయడం జరిగింది. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు ఇది ఒక విజువల్ వండర్ సినిమాలో అన్ని అంశాలు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి అని నేను నమ్ముతున్నాను.

చాలా చాలామంది కష్టపడ్డారు

చాలా చాలామంది కష్టపడ్డారు

ఈ సినిమా కోసం చాలా చాలామంది కష్టపడ్డారు. మా యూవీ క్రియేషన్స్ నిర్మాతలు కష్టకాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పూర్తి చేయగలిగారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. నిర్మాతల వల్లనే ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇక సినిమా కోసం ఎంతోమంది టెక్నీషియన్స్ కష్టపడ్డారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

పూజా హెగ్డే నటన అద్భుతంగా..

పూజా హెగ్డే నటన అద్భుతంగా..

సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు కూడా మేము ఎంతో సరదాగా ఉన్నాము. ఈ సినిమాలో చాలా మంచి నటీనటులు కూడా ఉన్నారు. ముఖ్యంగా జగపతిబాబు పాత్ర కూడా కనిపించేది కొద్దిసేపే అయినా కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. పూజా హెగ్డే కూడా తన గ్లామర్ తోనే కాకుండా నటనకు కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అద్భుతంగా నటించింది.

Recommended Video

Radhe Shyam : 12 Minutes Scene Is Highlight Of The Movie | Pushpa Trailer || Filmibeat Telugu
చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి

చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి

ఇక సినిమాకు సంబంధించిన మ్యూజిక్ కూడా అద్భుతంగా వచ్చింది. జస్టిన్ ప్రభాకర్ గారికి అలాగే మిగతా మ్యూజిక్ టెక్నీషియన్స్ కు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు రాధాకృష్ణ దాదాపు ఐదేళ్ళు వర్క్ చేశాడు. సినిమాను ఎలా చూపించాడో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు. సినిమాలో చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి. వేడుకలో చాలా ప్రత్యేకంగా నవీన్ అందరిని ఎంటర్టైన్మెంట్ చేశాడు. అయితే నేను ఇండియా మొత్తం తిరిగిన కూడా ఇంకా సిగ్గు అలానే ఉంది. ఇంకా ఓపెన్ గా మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చిన అభిమానులు అందరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు వారందరికీ ఐ లవ్యూ.. అంటూ ప్రభాస్ చాలా సింపుల్ గానే స్పీచ్ ను ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X