ఐఏఎస్ అధికారికి సందీప్ రెడ్డి వంగ కౌంటర్? ఏం జరిగింది? ఏమన్నాడు?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి సెన్సేషనల్ డైరెక్టర్ గా వచ్చారు సందీప్ రెడ్డి వంగ. తన చిత్రాలతో పాటు ఆయన సూటితనంతో డాషింగ్ డైరెక్టర్ గానూ గుర్తింపు పొందారు.
'అర్జున్ రెడ్డి' ఫిల్మ్ తో సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు ఇండియా మొత్తం షేక్ అయ్యింది. బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో అందాయి. టాలీవుడ్ లో సెన్సేషన్ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ తనదైన ముద్ర వేసుకున్నారు. మరో వైపు సందీప్ తొలిచిత్రానికి అదే స్థాయిలో విమర్శలు కూడా అందాయి.

తొలి చిత్రంతో సందీప్ రెడ్డి వంగ ప్రశంసలు అందుకున్న చోటే విమర్శలు స్వీకరించారు. కానీ అన్ని వ్యతిరేక ప్రచారాలను తిప్పి కొట్టారు. బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ ఇంటర్వ్యూలతో విమర్శకుల నోళ్లు మూయించారు. అదే క్రమంలో అందరినీ ఆకట్టుకున్నారు కూడానూ. ఇదిలా ఉంటే.. ఇప్పటి కూడా అర్జున్ రెడ్డి చిత్రాలపై పలు చోట్ల విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.

Prabhas Spirit Director Sandeep Reddy Vanga Strong Reply to IAS Officer for Criticising Animal Here is Details

2023లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'యానిమల్' ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డిలానే... 'యానిమల్' చిత్రానికి కూడా విమర్శల పర్వం కొనసాగింది. అయితే ఓ ఐఏఎస్ అధికారి యానిమల్ చిత్రంపై కామెంట్స్ చేయడం ఆ మధ్యన హాట్ టాపిక్ గ్గా మారింది. 'యానిమల్' వంటి చిత్రాల వల్ల సోసైటీ 10 ఏళ్లు వెనక్కి వెళ్తుందని భావించారు. అలాంటి సినిమాలు తీయడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు.

ఇక అదే విషయమై సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహ్తాతో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో స్పందించారు. సదరు ఐఏఎస్ అధికారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన సినిమాను అవమానించినందుకు సున్నితంగా రియాక్ట్ అయ్యారు. రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఇలా అన్నారు. తన 'యానిమల్' చిత్రాన్ని ఓ ఐఏఎస్ ఆఫీసర్ తక్కువ చేసి మాట్లాడాడని గుర్తు చేసుకున్నారు. తన సినిమా వల్ల సమాజ తిరోగమనం జరుగుతుందని భావించారు.

Prabhas Spirit Director Sandeep Reddy Vanga Strong Reply to IAS Officer for Criticising Animal Here is Details

కానీ మాలాంటి వాళ్లే 12th ఫెయిల్ లాంటి చిత్రాలను తీసి సోసైటికీ సందేశాలను ఇస్తున్నామన్నారు. 'యానిమల్' లాంటి సినిమాలు తీయొద్దని గతంలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు. కానీ తనేం క్రైమ్ కు పాల్పడటం లేదు కాదా అని బదులిచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఢిల్లీకి వెళ్లి 2 నుంచి 3 ఏళ్లు సమయం పెట్టి కష్టపడితే చాలు.. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు దండిగా ఉన్నాయన్నారు.

కానీ ఫిల్మ్ మేకర్, రైటర్ అవ్వడానికి ఇక్కడ ఎలాంటి కోర్సు సరిగా లేదన్నారు. అసలైన ఫిల్మ్ మేకర్ ను తయారు చేయడానికి ఏ కోర్సు, టీచర్ లేడని చెప్పుకొచ్చారు. కానీ ఆ అధికారి పేరు మాత్రం సందీప్ రెడ్డి వంగ చెప్పలేదు. ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీప్రొడక్షన్ ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తోనూ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ ఉండటం ఆసక్తికరంగా మారింది. అలాగే రణబీర్ కపూర్ తో 'యానిమల్ పార్క్' కూడా తెరకెక్కించాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X