స్పిరిట్ ఫస్ట్ లుక్.. సందీప్ న్యూఇయర్ సర్‌ప్రైజ్... యానిమల్ మోడ్‌లో ప్రభాస్ అరాచకంగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న చిత్రమే స్పిరిట్. ఎప్పుడో ప్రభాస్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిన ఈ ప్రాజెక్ట్ ఇంత వరకు పట్టాలెక్కలేదు. సందీప్ హీరోలు... మోస్ట్ వయలెంట్‌గా, అరాచకంగా కనిపిస్తారు. అలాంటిది ప్రభాస్‌ను వంగా ఎలా చూపిస్తారోనని సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. స్పిరిట్ పోస్టర్స్ పేరుతో రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ప్రభాస్ లుక్ ఇదేనంటూ ఫ్యాన్‌మెడ్ పోస్టర్స్ కూడా బయటకు వచ్చాయి. తాజాగా న్యూఇయర్ సందర్భంగా ఎవ్వరూ ఊహించని విధంగా డార్లింగ్ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు సందీప్ రెడ్డి వంగా.
న్యూఇయర్ సందర్భంగా సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు స్పిరిట్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు సందీప్ రెడ్డి. అసలే సెలబ్రేషన్స్ మోడ్‌లో ఉన్న డార్లింగ్ అభిమానులు.. ప్రభాస్ లుక్ చూసి మైండ్ బ్లాక్ అవుతున్నారు. ఈ పోస్టర్‌ని ఒకసారి పరిశీలిస్తే... సందీప్ గత చిత్రం యానిమల్ ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. రణ్‌బీర్ కపూర్ మాదిరిగానే ప్రభాస్ కూడా బాగా హెయిర్ పెంచి.. గుబురు గడ్డంతో షర్ట్ లేకుండా ఒళ్లంతా గాయాలతో వాటికి బ్యాండేజ్‌లతో ఉన్నాడు.
ఓ చేతిలో మందు పట్టుకుని నోటిలో సిగరెట్ పెట్టుకోగా.. అతనికి ఎదురుగా నిల్చొన్న హీరోయిన్ తృప్తి దిమ్రి లైటర్‌తో సిగరెట్‌ను వెలిగిస్తోంది. అయితే ప్రభాస్ ఫుల్ లుక్‌ని రివీల్ చేయకుండా కేవలం.. బ్యాక్ సైడ్ మాత్రమే చూపించారు. ఈ పోస్టర్‌తో డార్లింగ్ అభిమానులు పూనకంతో ఊగిపోతున్నారు. పోస్టరే ఇలా ఉంటే సినిమా ఇంకెంత వైల్డ్‌గా ఉంటుందోనని భావిస్తున్నారు. స్పిరిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

స్పిరిట్‌లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారని చిత్ర పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన పాత్ర కూడా మోస్ట్ వయలెంట్‌గా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ కూడా ఉంటుందని గాసిప్స్ వస్తున్నాయి. ఇక వివేక్ ఒబెరాయ్, ప్రభాస్, అలనాటి నటి కాంచన ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. భద్రకాళీ పిక్చర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్‌లు స్పిరిట్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా చిత్రీకరణ ముగిసిన వెంటనే స్పిరిట్ సెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇవి కాకుండా సలార్ 2, కల్కి 2 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఇవి కాకుండా ఆయన కోసం బాలీవుడ్ టు టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయి. స్పిరిట్ మూవీని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని సందీప్ పట్టుదలగా ఉన్నాడు.. ఇప్పడికే ప్రభాస్ కోసం దాదాపు రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నారు వంగా. ఈ నేపథ్యంలో షూటింగ్ పరుగులు పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2027లో స్పిరిట్ విడుదలయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











