Spirit: స్పిరిట్‌లో ప్రభాస్‌కు ధీటుగా లేడీ విలన్.. ఎవరీ ఐశ్వర్య దేశాయ్?

Prabhas Spirit Movie Villain: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక వైపు 'ఫౌజీ' షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు 'స్పిరిట్','కల్కి 2' సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఇందులో ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. మూవీ ప్రకటన నుంచే ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో ముఖ్యంగా విలన్ పాత్రపై భారీ అంచనాలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో స్పిరిట్ మేకర్స్ తాజాగా విడుదల చేసిన విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi)నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్‌లో నోటిలో సిగరెట్‌తో ఇంటెన్స్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అదే పోస్టర్‌లో వివేక్ ఒబెరాయ్ పక్కన కనిపించిన ఓ లేడీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నల్ల కళ్లద్దాలు ధరించి, సీరియస్ లుక్‌తో కనిపించిన ఆ భామ ఎవరు? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమెనే ఐశ్వర్య దేశాయ్ (Aishwarya Desai).

Prabhas Spirit Movie Who Is Aishwarya Desai Meet the Powerful Lady Villain Opposite Prabhas

ఐశ్వర్య దేశాయ్ ఎవరు?
ఐశ్వర్య దేశాయ్ భారత సంతతికి చెందిన అమెరికన్ నటి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. 2017లో 'జీనా ఇసీ కా నామ్ హై' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తర్వాత గల్లీ బాయ్ (Gully Boy) సినిమాలో నిక్కీ నరైన్ అనే గ్లామర్ రోల్‌లో కనిపించింది. రణ్ వీర్ సింగ్(Ranveer Singh)ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా 'రాట్ ఇన్ ది కిచెన్' అనే షార్ట్ ఫిల్మ్‌తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుంచి మార్కెటింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందిన ఐశ్వర్య, గ్లామర్‌తో పాటు నటనలోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. ఇప్పుడు ప్రభాస్ 'స్పిరిట్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది.

స్పిరిట్‌లో లేడీ విలన్?
సమాచారం ప్రకారం.. 'స్పిరిట్'లో ఐశ్వర్య దేశాయ్ లేడీ విలన్‌గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వివేక్ ఒబెరాయ్‌కు జోడీగా బోల్డ్, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో ఆమె కనిపించనుందట. దర్శకుడు సందీప్ వంగా ఆమె పాత్రను డిఫరెంట్‌గా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతని పాత్రకు ధీటుగా నిలిచే విధంగా విలన్ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ (Triptii Dimri) నటిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

మేకర్స్ ప్రకటన ప్రకారం.. 'స్పిరిట్'ను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే స్టార్-స్టడెడ్ కాస్ట్ తో ఉన్న ఈ సినిమాలో ఐశ్వర్య దేశాయ్ ఎంట్రీ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం ఒక్క పోస్టర్‌తోనే ఆమె సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రభాస్- సందీప్ వంగా కాంబోలో వస్తున్న ఈ హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఐశ్వర్య దేశాయ్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో చూడాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: prabhas vivek oberoi spirit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X