Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో కానుక.. అదిరిపోయిన కొత్త పోస్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి పరిచయమైనా.. అతి తక్కువ సమయంలోనే తన సత్తాను చాటుకుని పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభం నుంచీ టాలీవుడ్‌కే పరిమితమైన అతడు.. 'బాహుబలి' సిరీస్‌తో రేంజ్‌ను పెంచుకున్నాడు.
దీంతో వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా మారాడు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

భారీ బడ్జెట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో.. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందుతోంది.
విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే పోస్టర్ విడుదలైంది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ నుంచి శ్రీరామనవమి సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా మరో పోస్టర్ విడుదలైంది.
ఇందులో కేవలం ఆంజనేయ స్వామి పాత్రను మాత్రమే పరిమితం చేయకుండా.. బ్యాగ్రౌండ్‌లో రాముడిగా ప్రభాస్‌ను కూడా చూపించారు. దీంతో ఈ పోస్టర్‌కు కూడా అన్ని వర్గాల వాళ్ల నుంచి అదిరిపోయే స్పందన దక్కుతోంది. దీంతో ఇది వైరల్ అవుతోంది.
'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











