Adipurush: ఆదిపురుష్ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. సతీసమేతంగా వచ్చేసిన శ్రీరాముడు

బడా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చినా.. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అంతేకాదు, 'బాహుబలి'తో అతడి రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా అన్నీ భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇందులో నేరుగా హిందీలో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' ఒకటి. రామాయణం నాటి కథతో రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం? అదేంటో మీరే చూసేయండి!

ఆదిపురుష్‌గా వస్తున్న ప్రభాస్

ఆదిపురుష్‌గా వస్తున్న ప్రభాస్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రూపకల్పనలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో రెబెల్ స్టార్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేస్తున్నాడు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు.

అలాంటి కథతో ఆదిపురుష్

అలాంటి కథతో ఆదిపురుష్

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' అనే చారిత్రక సినిమాలోనూ నటిస్తున్నాడు. దీంతో బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో రామయణం నేపథ్యంతో రూపొందుతోంది. చెడుపై మంచి గెలవడం అనే కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామాయణంలోని ప్రధానమైన థీమ్‌ను తీసుకుని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

షూట్ కంప్లీట్.. అదే పనిలో

షూట్ కంప్లీట్.. అదే పనిలో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఆ వెంటనే చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టింది. గ్రాఫిక్స్ ఎక్కువ ఉండడం వల్ల దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. దీనికితోడు మరికొన్ని సన్నివేశాలను మార్చే పని వల్ల ఇది మరింత ఆలస్యం అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సంక్రాంతి కాదు.. అప్పుడే

సంక్రాంతి కాదు.. అప్పుడే


పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, దీన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, ఆ తర్వాత ఈ మూవీని 2023, జూన్ 16న విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.

ఫ్యాన్స్‌కు పండుగ కానుక

ఫ్యాన్స్‌కు పండుగ కానుక


క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ నుంచి శ్రీరామనవమి సందర్భంగా ఏదో సర్‌ప్రైజ్ రాబుతుందని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా కనిపించారు.

దాని కన్నా గొప్పది నీ నామం

దాని కన్నా గొప్పది నీ నామం

'ఆదిపురుష్' నుంచి తాజాగా ఈ పోస్టర్‌ను విడుదల చేసిన సమయంలో డైరెక్టర్ ఓం రౌత్ తెలుగులో కూడా ట్వీట్ చేశాడు. అందులో 'మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్' అంటూ రాసుకొచ్చారు. అలాగే, ఇందులో రిలీజ్ డేట్‌ను కూడా 2023, జూన్ 16నే ఉంచారు. మొత్తానికి ప్రభాస్ మూవీ నుంచి ఓ పోస్టర్ రావడంపై అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X