Adipurush: ఆదిపురుష్ నుంచి మరో ట్రైలర్.. ఆరోజే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్
కొంత కాలంగా వరుస పెట్టి పాన్ ఇండియా రేంజ్ చిత్రాలనే చేస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే పలు సినిమాలతో సత్తా చాటిన అతడు.. ఇప్పుడు ఏకంగా నాలుగైదు ప్రాజెక్టులు చేస్తోన్నాడు. అందులో రామాయణం నేపథ్యంతో వస్తున్న 'ఆదిపురుష్' ఒకటి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీతోనే ప్రభాస్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.
హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో విజువల్ వండర్‌గా రూపొందిన 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ ఎప్పుడో అయిపోయింది. అప్పటి నుంచి చాలా రోజుల పాటు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగాయి. మొదట్లో ఇవి అంత క్వాలిటీగా రాకపోవడంతో మంచి ఔట్‌పుట్ కోసం మళ్లీ మళ్లీ దీనిపై పని చేశారు. ఇలా ఇటీవలే క్వాలిటీతో కూడిన ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో సినిమాపై హైప్ కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్ రాబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ నుంచి వరుసగా అప్‌డేట్లను ఇస్తూనే ఉన్నారు. ఇలా దీని నుంచి టీజర్, ట్రైలర్, పాటలను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్‌ను జూన్ 6వ తేదీన రిలీజ్ చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారట. ఇక, ఈ వీడియోలో గత ట్రైలర్‌లో చూపించని కొత్త అంశాలతో తయారు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ట్రైలర్‌ను జూన్ 6న తిరుపతిలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ రాబోతుందన్న మాట.

ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా హనుమంతుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి అజయ్ - అతుల్ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











