Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. ఇండియాలోనే తొలిసారిగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి.. 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో దండయాత్ర చేస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే కొన్ని భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు చేతిలో నాలుగైదు ప్రాజెక్టులను పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇలా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో రామాయణం బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న 'ఆదిపురుష్' ఒకటి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.
బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'.చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టుకు రామాయణాన్ని జోడించి ఈ సినిమా తెరకెక్కింది. అయితే, గతంలో ఏ సినిమాలోనూ చూపించని విజువల్స్‌ను ఇందులో డిజైన్ చేశారు. ఇందుకోసం విదేశీ టెక్నాలజీని కూడా వాడుకున్నారు. అందుకే ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ లీక్ అయింది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని అప్‌డేట్లు మాత్రమే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా నుంచి 'జై శ్రీరామ్' అనే ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమా జూన్ 16న విడుదల అవుతోన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఆదిపురుష్ ట్రైలర్‌ను మే 17వ తేదీన రిలీజ్ చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారట. ఇక, ఈ వీడియో గతంలో ఎన్నడూ చూడని కొత్త అంశాలతో కట్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి అజయ్ - అతుల్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











