Adipurush: ముందే వచ్చేస్తున్న ఆదిపురుష్ ట్రైలర్.. ప్రభాస్ నుంచి మరో సర్‌ప్రైజ్ ఏంటంటే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగిపోయింది. ఫలితంగా మన హీరోలకు దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. దీంతో టాలీవుడ్ స్టార్లు బాలీవుడ్‌లో సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు. అప్పుడలా చేస్తోన్న వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు.
'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయిన అతడు.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రభాస్ 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.

చారిత్రక చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు ఓం రౌత్ రూపకల్పనలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. విజువల్ ఎఫెక్ట్స్‌తో రామాయణాన్ని సరికొత్తగా చూపించేలా దీన్ని తెరకెక్కించారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మొదట్లో ఇవి అంత క్వాలిటీగా రాకపోవడంతో మంచి ఔట్‌పుట్ కోసం మళ్లీ మళ్లీ దీనిపై పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి క్రేజ్ న్యూస్ లీకైంది.
ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ నుంచి వరుసగా అప్‌డేట్లను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్‌ను మే 9వ తేదీన రిలీజ్ చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారట. ఇక, ఈ వీడియో గతంలో ఎన్నడూ చూడని కొత్త అంశాలతో కట్ చేస్తున్నారని తెలుస్తోంది.

అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తెలుగు ఈవెంట్‌ను తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారట. దీన్ని జూన్ మొదటి వారంలో జరుపుతారని తెలిసింది.
ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా హనుమంతుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి అజయ్ - అతుల్ సంగీతం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











