Adipurush Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. నవమి తర్వాత మరో సర్‌ప్రైజ్

పేరుకు తెలుగు హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుని పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్న అతడు.. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లోనే 'ఆదిపురుష్' అనే సినిమాలో నటిస్తోన్నాడు. రామాయణాన్ని ఇప్పటి ప్రేక్షకులకు సరికొత్తగా చూపించేలా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలోనే ఏర్పడ్డాయి.

చారిత్రక చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపకల్పనలో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని స్టోరీ లైన్‌తో.. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు చిత్ర యూనిట్ ఆరంభంలోనే ప్రకటించింది. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

Prabhas Starrer Adipurush Trailer Release on May Second Week

విజువల్ వండర్‌గా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని అప్‌డేట్లు మాత్రమే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. దీన్ని మే రెండో వారంలో రిలీజ్ చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అంటే.. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ మూవీ నుంచి వరుసగా రెండు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయన్న మాట. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ చేసుకునే న్యూస్ అనే చెప్పాలి.

'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X