Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ట్రైలర్ డేట్ లీక్.. కరెక్టుగా అదే రోజు ఎందుకంటే!
తెలుగు సినిమా రేంజ్ ఈ మధ్య కాలంలో భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో మన హీరోలు కూడా తమ స్థాయిని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో అందరి కంటే ఎక్కువ ఎత్తులోనే ఉన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. కొంత కాలంగా ప్రతిష్టాత్మక చిత్రాలు చేస్తోన్న అతడు.. బాక్సాఫీస్‌పై ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఇలా జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు.
చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడిన ప్రభాస్.. గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్'తో సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందులో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న 'కల్కి 2898 ఏడీ' ఒకటి. ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తీస్తున్నారు.

టైం ట్రావెల్ కథతో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌తో తీస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని హై రేంజ్ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా చిత్రీకరించి ఇప్పటికే దాదాపుగా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసేశారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా హై లెవెల్ గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లతో పాటు ఓ గ్లింప్స్ వీడియోను మాత్రమే విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేస్తారని అంటున్నారు. దానిపై క్లారిటీ రాకుండానే ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ డేట్ తాజాగా బయటకు వచ్చేసింది.

సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీ మే 9వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో.. ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 9వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది. కరెక్టుగా ఆరోజుకు రిలీజ్ డేట్ నెల ఉంటుంది. అందుకే ఏప్రిల్ 9న ట్రైలర్‌ను తీసుకొస్తున్నారట. అప్పటి నుంచి మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారని టాక్.
ఇదిలా ఉండగా.. 'కల్కి 2898 ఏడీ' మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











