Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. కల్కి ట్రైలర్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలు చేసి సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించాడు రెబెల్ స్టార్ ప్రభాస్. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం భారీ సినిమాలతో దూసుకుపోతోన్నాడు. ఇలా పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతోన్నాడు. దీనికితోడు గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్' అనే చిత్రంతో వచ్చి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ జోష్‌లోనే మరింత ఉత్సాహంగా ముందుకెళ్తున్నాడు.
'సలార్: సీజ్‌ఫైర్' సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ప్రభాస్.. ఇప్పుడు పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందులో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న 'కల్కి 2898 ఏడీ' ఒకటి. ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.

టైం ట్రావెల్ స్టోరీతో తెరకెక్కుతోన్న 'కల్కి 2898 ఏడీ' సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తీస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా చిత్రీకరించి ఇప్పటికే దాదాపుగా టాకీ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లతో పాటు ఓ గ్లింప్స్ వీడియోను మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన డిఫరెంట్ ప్రమోషన్ వీడియోలు వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.

బడా స్టార్ల కాంబినేషన్లలో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీ జూన్ 27వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో.. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. ఇందులో విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. 'కల్కి 2898 ఏడీ' మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











