Salaar మూవీ సెన్సేషనల్ రికార్డు: ఏమీ రాకుండానే లక్ష కొట్టేసిన సినిమా

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినా.. 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు సినిమాలను కూడా ప్రేక్షకులకు అందించాడు. అలాగే, ఇప్పుడు ఏకకాలంలో వరుసగా మూడు, నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఇక, ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. కేజీఎఫ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో పవర్‌ఫుల్ కాన్సెప్టుతో రాబోతున్న 'సలార్' మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ను గత ఏడాది ప్రారంభంలోనే మొదలెట్టారు. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో, రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేశారు. వీటిలో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను కూడా తీశారు. అలాగే, మిగిలిన నటీనటుల పైనా ఎన్నో భారీ బడ్జెట్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక, ఇప్పుడు కూడా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

Prabhas Starrer Salaar Movie Gets 100K Interests in BookMyShow

'సలార్' మూవీ 2023 సెప్టెబర్ 28న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెటింగ్ వెబ్‌సైట్ బుక్‌మైషో ఇటీవలే ఈ సినిమా వివరాలను అందులో పొందుపరిచింది. దీంతో ఈ సినిమాపై ఎంతో మంది ఆసక్తిని తెలుపుతున్నారు. ఇలా తాజాగా ఈ మూవీ బుక్‌మైషోలో 100K (లక్ష) మంది ఆసక్తిని పొందింది. అది కూడా టీజర్, ట్రైలర్, సాంగ్స్ వంటివి ఏమీ విడుదల కాకముందే ఈ మార్కును చేరుకుంది. తద్వారా ఇలా 100K ఇంట్రెస్టులను పొందిన ఏకైక మూవీగా రికార్డు సాధించింది. అలాగే, ఆదిపురుష్‌కు 74K, Project K మూవీకి 4.5K మంది ఆసక్తిని చూపించారు.

Prabhas Starrer Salaar Movie Gets 100K Interests in BookMyShow

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X