Prabhas: సలార్ కోసం బాహుబలి ప్లానింగ్.. దానికంటే ఎక్కువ వచ్చేలా మాస్టర్ ప్లాన్

తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న ఏ స్టార్ హీరో కూడా చేయని విధంగా ఏకధాటిగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఎన్నో సినిమాల్లో నటిస్తోన్న అతడు.. సత్ఫలితాలను మాత్రం అందుకోవడం లేదు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపకల్పనలో ప్రభాస్ 'సలార్' అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తైనా.. పోస్ట్ ప్రొడక్షన్‌కు మాత్రం చాలా సమయం తీసుకున్నారు. మంచి ఔట్‌పుట్ వచ్చే వరకూ వర్క్ చేస్తూనే వచ్చారు. ఇలా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు.

Prabhas Starrer Salaar Movie Pre Release Event Details Leaked

రెండు భాగాలుగా రూపొందిన 'సలార్' మూవీకి సంబంధించిన మొదటి పార్టును డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. దీనికి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది.

అత్యంత భారీ బడ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'సలార్' మూవీని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు చిత్ర యూనిట్ ఎన్నో ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 2వ వారంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్రాండ్ ఈవెంట్‌ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

Prabhas Starrer Salaar Movie Pre Release Event Details Leaked

'సలార్' మూవీ ఈవెంట్‌ను గతంలో ప్రభాస్ సినిమాలకు జరిపినట్లుగానే బహిరంగ ప్రదేశంలో నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. దీనికి 'బాహుబలి' సినిమా ఈవెంట్ కంటే ఎక్కువ మందిని రప్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని అంటున్నారు. అదే కనుక నిజం అయితే ప్రభాస్ అభిమానులకు పండుగే అనడంలో ఏమాత్రం సందేహమే లేదు.

ఇదిలా ఉండగా.. 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X