Salaar: సలార్ మూవీ రన్ టైం లీక్.. అన్ని గంటలు అంటే సాధ్యమేనా?
బాహుబలి తర్వాత తన రేంజ్‌ను పాన్ ఇండియా స్థాయికి పెంచుకోవడంతో పాటు వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. విజయాలను మాత్రం ఆశించిన రీతిలో సొంతం చేసుకోలేకపోయాడనే చెప్పాలి.
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు అతడు చాలా మూవీల్లో నటిస్తున్నాడు. అందులో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ చిత్రం నుంచి ప్రచార చిత్రాలను కూడా వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీకి సంబంధించిన ఫస్ట్ కాపీ తాజాగా రెడీ అయినట్లు తెలిసింది. అంతేకాదు, ఇది దాదాపు మూడు గంటల పది నిమిషాలకు పైగానే రన్ టైమ్‌తో వచ్చినట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో కొద్ది రోజుల క్రితమే మరోసారి దీనిపై చిత్ర యూనిట్ ఎడిటింగ్ వర్క్‌ను ప్రారంభించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

ఎలాంటి సినిమానైనా మూడు గంటల కంటే ఎక్కువగా కట్ చేస్తే ప్రేక్షకులు ఆసక్తి చూపించరని భావించిన 'సలార్' యూనిట్.. దీన్ని మరో 15 లేదా 20 నిమిషాలు కట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తంగా రెండు గంటల యాభై నిమిషాల ఔట్‌పుట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

ఇక.. క్రేజీ కాంబోలో రూపొందుతోన్న 'సలార్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ మూవీని సెప్టెంబర్ 28న ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











