Prabhas: సలార్ రెండో ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. ఈసారి అణుబాంబ్ రేంజ్ విధ్వంసమే!

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోగా హవాను చూపించి.. ఇప్పుడు పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సలార్' అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే.

కేజీఎఫ్‌తో ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'సలార్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. అందులో మొదటి పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' పేరుతో డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

Prabhas Starrer Salaar Movie Second Trailer Release on December 16th

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. దీనికి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఇండియాలోనే ఏ సినిమాకు రాని వ్యూస్, లైకులను ఇది సాధించింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'సలార్: సీజ్‌ఫైర్‌' మూవీకి సంబంధించి మరో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మరింత సమాచారం వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 16వ తేదీన విడుదల చేయబోతున్నారట.

Prabhas Starrer Salaar Movie Second Trailer Release on December 16th

ఫుల్ లెంగ్త్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న చిత్రం కావడంతో 'సలార్' నుంచి వచ్చే రెండో ట్రైలర్‌ను హై రేంజ్‌లోనే కట్ చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇందులో ఊరమాస్ ఫైట్స్ సీన్స్‌ను చూపించబోతున్నారు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ మూవీ నుంచి వచ్చే రెండో ట్రైలర్ అణుబాంబుకు మించిన విధ్వంసాన్ని చూపించే విధంగా ఉంటుందట.

ఇదిలా ఉండగా.. 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది కీలక పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X