Salaar మూవీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్: ప్రభాస్ డిసైడ్ అయితే అంతే మరి!
తనదైన టాలెంట్లు, హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ప్రియులను ఫిదా చేసేసి.. సుదీర్ఘ కాలం పాటు వరుస చిత్రాలతో హవాను చూపించాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి వరుసగా బిగ్ బడ్జెట్ మూవీలను మాత్రమే నటిస్తోన్న అతడు.. అన్ని భాషల్లోనూ మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోన్నాడు. ఇలా ఇప్పుడు అతడు ఏకంగా మూడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అందులో 'సలార్' ఒకటి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి.
పవర్‌ఫుల్ కాంబోలో రాబోతున్న 'సలార్' మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాది ప్రారంభంలోనే మొదలెట్టారు. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో, రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేశారు. వీటిలో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను కూడా తీశారు. అలాగే, మిగిలిన నటీనటుల పైనా ఎన్నో భారీ బడ్జెట్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక, ఇప్పుడు కూడా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ లీకైంది.

'సలార్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఎంత వరకూ పూర్తైంది అనే దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు ఇది ఎప్పటికి పూర్తవుతుందో అన్నది సస్పెన్స్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టాకీ పార్ట్ చివరి దశకు చేరుకుందట. అంతేకాదు, ఇప్పుడు జరుగుతున్నదే చివరి షెడ్యూల్ అని కూడా తెలిసింది. మరీ ముఖ్యంగా ఈ ఫిబ్రవరి చివరి నాటికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అవబోతుందని సమాచారం. ఇందుకోసం ప్రభాస్ ప్లాన్ చేశాడని అంటున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ వేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని 2023 సెప్టెబర్ 28న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











