Salaar Teaser: ప్రభాస్ ఫ్యాన్స్కు వైలెంట్ ట్రీట్.. డేట్, టైం వచ్చేసింది డార్లింగ్స్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. దాదాపు ఐదారేళ్లుగా దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఇది ఒకటి. అంతలా అతడు తనదైన పాన్ ఇండియా చిత్రాలతో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. అంతేకాదు, ఏక కాలంలోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు. ఇలా ఇప్పటికే పలు భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. హై ఓల్టేజ్ యాక్షన్తో రూపొందుతోన్న ఈ సినిమాను 'కేజీఎఫ్' సిరీస్తో సెన్సేషన్ అయిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ సజావుగా సాగలేదు. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఇటీవలే దీనికి సంబంధించిన టాకీ పార్టు మొత్తాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసినట్లు ఓ న్యూస్ లీకైంది.

పవర్ఫుల్ కాంబినేషన్లో రాబోతున్న 'సలార్' మూవీని సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. దీనికి సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి టీజర్ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దీన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన లేదా జూలై 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చాలా వార్తలు వైరల్ అయ్యాయి.
ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతోన్న నేపథ్యంలో 'సలార్' మూవీ టీజర్పై చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రకటనను వదిలింది. ఇందులో దీన్ని జూలై 6వ తేదీ, ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ మేరకు ఓ పవర్ఫుల్ పోస్టర్ను కూడా వదిలింది. ఇందులో ప్రభాస్ చేతిలో ఓ ఆయుధాన్ని పట్టుకుని శత్రువులను ఊచకోత కోస్తున్నట్లు చూపించారు. దీంతో 'సలార్' టీజర్పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.
ఇక, 'సలార్' మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











