Salaar: ముందుగానే సలార్ టీజర్.. కేజీఎఫ్ 2ను మించిన ట్రీట్‌

ఒక స్టార్ హీరో సినిమా పూర్తి చేయాలంటే తక్కువలో తక్కువగా ఒక ఏడాది సమయం పడుతుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న బడా హీరోలు అందరిదీ ఇది పరిస్థితి. అయితే, ఒకే ఒక్క హీరో మాత్రం ఏకంగా ఏడాదికి రెండు చిత్రాలను ఇచ్చేలా ప్లాన్ చేస్తూ దూసుకుపోతోన్నాడు.

అతడే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా ఏకధాటిగా సినిమాలు చేస్తున్న అతడు.. ఇటీవలే 'ఆదిపురుష్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ మరిన్ని చిత్రాలను చేస్తున్నాడు. అందులో 'సలార్' మూవీ ఒకటి.

Prabhas Starrer Salaar Movie Teaser Release on July 7th

కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ప్రభాస్ చేస్తున్న సినిమానే 'సలార్'. రెండేళ్ల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది.

అప్పటి నుంచి ఎన్నో బ్రేకులు తీసుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా షూటింగ్ చేస్తూ వచ్చారు. ఇలా ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్టు మొత్తాన్ని దాదాపుగా పూర్తి చేసుకున్నారు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌పై ఓ న్యూస్ లీకైంది.

'సలార్' మూవీ టీజర్‌ గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే దీన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. కానీ, దీనిపైన కూడా ఎలా క్లారిటీ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఢీలా పడిపోయారు.

ఈ పరిస్థితుల్లో తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా టీజర్‌ను జూలై 7వ తేదీనే విడుదల చేయబోతున్నారట. దీనిపై జూన్ చివరి నుంచి అప్‌డేట్లు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఈ టీజర్‌ను కేజీఎఫ్ 2 కంటే పవర్‌ఫుల్‌గా కట్ చేస్తున్నారని సమాచారం.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X