Salaar Trailer: సలార్ ట్రైలర్‌కు టైం ఫిక్స్.. భలే సర్‌ప్రైర్ ఇచ్చారుగా!
భారతదేశంలోని ఏ పాన్ ఇండియా స్టార్‌కూ సాధ్యం కాని విధంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే గత నెలలో అతడు 'ఆదిపురుష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దీని తర్వాత ఈ స్టార్ హీరో తన మరో సినిమా 'సలార్'పై ఫోకస్ చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

'సలార్' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ సజావుగా సాగలేదు. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఇటీవలే దీనికి సంబంధించిన టాకీ పార్టు మొత్తాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసేశారు.
ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో వేగంగా వంద మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్‌గా ఇది చరిత్రను సృష్టించింది.
టీజర్‌కు వచ్చిన ఊహించని రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. దీంతో త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన వదిలింది. అందులో 'ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.
సలార్ టీజర్ చూపించిన ప్రభంజనంలో మీరంతా భాగస్వాములై, మాపై మీరు చూపిన అపారమైన ప్రేమ, అభిమానం, మద్దతుకు రుణపడి ఉంటాము. పాన్ ఇండియా మూవీ సలార్ టీజర్ 100 మిలియన్ల వ్యూస్ సాధించి దూసుకెళ్తోంది. దీనికి మీ అందరికీ ధన్యవాదాలు' అని పేర్కొంది.

అంతేకాదు, ఇదే నోట్‌లో 'మీ క్యాలెండర్‌లో ఆగస్టు నెలను మార్క్ చేసి పెట్టుకోండి. భారతీయ సినిమా ప్రభావాన్ని చాటి చెప్పే అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్ మీకోసం వస్తుంది. మీకు మరపురాని అనుభవాన్ని కలిగించే మరిన్ని అప్‌డేట్స్ కోసం సిద్ధంగా ఉండండి. మన ఇండియన్ సినిమా శక్తిని చాటి చెప్పే ఈ ఆనందకరమైన ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిద్దాం' అని చెప్పింది.
ఇదిలా ఉండగా.. 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











