పెదనాన్న రుణం తీర్చుకొన్న ప్రభాస్.. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో కృష్ణంరాజు శక్తి కూడగట్టుకొని..!

నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో అజాత శత్రువు లాంటి వ్యక్తి ఇక లేరనే విషయాన్ని ఊహించుకొని దిగ్రాంతికి లోనవుతున్నారు. ఇక ప్రభాస్, కుటుంబ సభ్యులందరి పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెదనాన్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ పెద్ద సాహసమే చేశారు. అందుకు కృష్ణంరాజు కూడా సహకరించడంతో పెదనాన్న రుణాన్ని తీర్చుకొనే అవకాశం యంగ్ రెబల్ స్టార్‌కు దక్కింది. ఆ వివారాల్లోకి వెళితే..

యంగ్ రెబల్ స్టార్‌ కెరీర్‌ను ఓ రేంజ్‌కు

యంగ్ రెబల్ స్టార్‌ కెరీర్‌ను ఓ రేంజ్‌కు

ప్రభాస్‌కు మార్గదర్శి, గురువు, ఫిలాసఫర్ కృష్ణంరాజే. తన చేతుల మీదుగా పెరిగిన యంగ్ రెబల్ స్టార్‌ కెరీర్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లడంలో ఆయన తనదైన శైలిలో ప్లాన్ చేశారు. తన చేతుల మీదుగా ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్‌కు క్లాప్ కొట్టి ఆశీస్సులు అందించారు. ప్రభాస్‌ను నడిపించిన తీరుపై సినీ వర్గాలు ఆశ్చర్యపోతుంటాయి.

భిల్లా, రెబల్ చిత్రాల్లో నటించి

భిల్లా, రెబల్ చిత్రాల్లో నటించి

ప్రభాస్ కెరీర్‌ను ఒడిదుడుకుల నుంచి బ్రహ్మండమైన స్టేజ్‌కు తీసుకు రావడానికి కృష్ణంరాజు తెరవెనుక కృషి ఎంతైనా ఉంది. ఇద్దరు కలిసి భిల్లా, రెబల్ చిత్రాల్లో నటించి అభిమానులకు పండుగ లాంటి వాతావరణాన్ని అందించారు. అయితే అవకాశం వస్తే ఇద్దరు కలిసి నటించాలని ఎదురు చూశారు. కానీ కరోనావైరస్ కారణంగా ఆ విషయం సాధ్యం కాలేదు. కరోనావైరస్ బారిన పడిన తర్వాత కృష్ణం రాజు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది.

రాధేశ్యామ్ షూటింగు సమయంలో

రాధేశ్యామ్ షూటింగు సమయంలో

అయితే రాధేశ్యామ్ షూటింగు సమయంలో కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారడంతో ప్రభాస్ ఆందోళనకు గురయ్యారు. అయితే పరిస్థితిని ముందే ఊహించారేమో.. పెదనాన్నతో స్క్రీన్‌ను పంచుకోవాలని డిసైడ్ అయ్యారనే విషయాన్ని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. అందుకే రాధేశ్యామ్‌లో కృష్ణంరాజును నటింపజేయడంలో ప్రభాస్ చొరవ తీసుకొన్నాడు. ఆ చిత్రంలో కీలకపాత్రలో రెబల్ స్టార్‌తో కలిసి నటించాడు.

కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా

కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది. నడవలేని పరిస్థితుల్లో వీల్ చైర్‌లో ఉన్నారు. అలాంటి సమయంలో రాధేశ్యామ్ సినిమాలో గురువు పాత్ర కోసం వీల్ చైర్‌లోనే ఉంటూ ఆయన నటించారు. అలా ప్రభాస్ పెదనాన్నతో కలిసి నటించడమే కాకుండా అభిమానుల కలను మరోసారి తీర్చాడు. తనకు సినీ జన్మను ప్రసాదించిన పెదనాన్నతో కలిసి నటించి తన రుణాన్ని తీర్చుకొనే ప్రయత్నం చేశారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

కృష్ణంరాజుతో స్క్రీన్ షేర్

కృష్ణంరాజుతో స్క్రీన్ షేర్


రాధేశ్యామ్ చిత్రంలో కృష్ణంరాజు పోషించిన పాత్రను సత్యరాజ్ చేయాల్సి ఉంది. తమిళంలో సత్యరాజ్ ఆ పాత్రను పోషించారు. అయితే కృష్ణంరాజుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఓ కోరిక కారణంగా సత్యరాజ్‌ స్థానంలో రెబల్ స్టార్‌ను తీసుకొచ్చారు. ఇక తన కెరీర్‌లో కృష్ణంరాజు నటించిన చివరి చిత్రం కూడా రాధేశ్యామ్ కావడం గమనార్హం. అంతేకాకుండా ప్రభాస్, కృష్ణంరాజు నటించిన చివరి చిత్రంగా రాధేశ్యామ్ మారింది.

కృష్ణంరాజు అంత్యక్రియలు మోయినాబాద్‌లో

కృష్ణంరాజు అంత్యక్రియలు మోయినాబాద్‌లో

కృష్ణంరాజు అంత్యక్రియలు హైదరాబాద్ నగర శివారులోని మోయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు కృష్ణం రాజు అంత్యక్రియలను అక్కడే కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహిస్తారు అని ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. మధ్యాహ్నం ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అంత్యక్రియల నిర్వహణ సమయంలో మీడియా కవరేజిపై ఆంక్షలు విధించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X