ప్రభాస్ గురించి ఫేక్ న్యూస్.. ఖండించిన డార్లింగ్ టీమ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రీసెంట్ గా మళ్లీ రూమర్లు పుట్టుకొచ్చాయి. ఎప్పటి నుంచో ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నప్పటికీ ఎలాంటి అప్డేట్ మాత్రం అధికారికంగా రాలేదు. కానీ అప్పుడప్పుడు మాత్రం ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ అభిమానులు మాత్రం ఆరా తీస్తూనే ఉన్నారు. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్, అదే వరుసలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానూ ఉండిపోయారు.

ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ ఇప్పటికే ఎన్నో మార్లు ప్రశ్నలు ఆయనకు ఎదరయ్యాయి. ఇక 'బాహుబలి' చిత్రం తర్వాత నుంచి ప్రభాస్ కు ఈ టెన్షన్ మరింత పెరిగిపోతోంది. ఫ్యాన్స్ నుంచి కూడా అవే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ ఓ స్టార్ హీరోయిన్ రిలేషన్ లో ఉన్నారంటూ కూడా రూమర్లు పుట్టుకొచ్చాయి. కొన్నేళ్ల పాటు అంతా అదే నమ్మారు. ఈ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రభాస్, అనుష్క ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ చూసి రిలేషన్ షిప్ వార్తలు వచ్చాయి.

Prabhas Team Clarification on Marriage Rumours Here is their note

వాటిని అటు ప్రభాస్, ఇటు అనుష్క శెట్టి ఎన్నో ఇంటర్వ్యూల్లో ఖండిస్తూనే వచ్చారు. తాము మంచి స్నేహితులమని, ఎలాంటి రిలేషన్ షిప్స్ లేవని చెప్పుకుంటూ వచ్చారు. అయితే, ప్రభాస్ కు ప్రస్తుతం 45 ఏళ్ల వయస్సు కావడం విశేషం. దీంతో ఇంకెప్పుడు డార్లింగ్ పెళ్లి చేసుకుంటారంటూ అంతా ఎదురుచూస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ఒక ఇంటివాడైతే చూసి ఆనంద పడాలని దేశం మొత్తంగా అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా మరో రూమర్ పుట్టుకొచ్చింది.

డార్లింగ్ ప్రభాస్ హైదరాబాద్ కు చెందిన ఓ బిజినెస్ కుటుంబంలోని అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో మరింతగా ఈ వార్త వైరల్ అయ్యింది. అది కాస్తా ప్రభాస్ పర్సనల్ టీమ్ వరకు వెళ్లింది. దీంతో ప్రభాస్ పర్సనల్ టీమ్ వెంటనే స్పందించింది. ప్రభాస్ బిజినెస్ మెన్ కూతురిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఖండించారు. అది పూర్తిగా అవాస్తవమని ఎవరూ నమ్మొద్దని తెలిపారు. ఇక ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేయొద్దని హెచ్చరించినట్టు తెలుస్తోంది.

ఇక ప్రభాస్ కు ఇప్పటికే బాహుబలి చిత్రం తర్వాత 5 వేల వరకు పెళ్లి సంబంధాలు వచ్చాయని కూడా వార్తలు వచ్చాయి. వాటిలో ఒకటి ఫైనల్ చేశారంటూ వచ్చిన వార్తలకు చెక్ పడింది. మొత్తానికి టీమ్ స్పందించడంతో ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేదని తెలిసిపోయింది. ఇక ప్రభాస్ తన కెరీర్ పైనే ప్రస్తుతం ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇండియాలోనే కాకుండా వరల్డ్ మార్కెట్ ను కూడా డార్లింగ్ టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. చివరిగా 'సలార్', 'కల్కి' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. నెక్ట్స్ డార్లింగ్ నుంచి 'రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. త్వరలో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో 'స్పిరిట్' షూట్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Read more about: prabhas marriage fake news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X