సర్‌ప్రైజ్ ఇస్తానంటూ ప్రభాస్ సింగల్ డైలాగ్.. అదే విషయం చెప్పనున్నాడా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సర్‌ప్రైజ్ చేయబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు ప్రభాస్. హాయ్ డార్లింగ్స్.. రేపు మీకో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నా.. నా ఇన్స్‌స్టాగ్రామ్ ఫాలో కండి అంటే కేవలం ఒకే ఒక్క డైలాగ్‌తో ఈ వీడియో ముగించారు ప్రభాస్. దీంతో ఇంతకీ ప్రభాస్ ఇవ్వబోతున్న ఆ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందా? అనే కోణంలో చర్చలు ఊపందుకున్నాయి.

39 ఏళ్ల ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్‌గా కొనసాగుతున్నారు. దీంతో అందరి కళ్లు ప్రభాస్ పెళ్లి పైనే పడ్డాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రభాస్ పెళ్లిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభాస్ తన పెళ్లి గురించిన సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఇక మరోవైపు ప్రభాస్ సాహూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అలాగే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక దానికి సంబందించిన సర్‌ప్రైజ్ ఏమైనా ఇస్తాడా? అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రభాస్ పెట్టిన ఈ వీడియో అందరిలోనూ సరికొత్త ఆసక్తికి తెరలేపింది.

ఇక టెక్నాలజీకి కాస్త దూరంగా ఉంటున్న ప్రభాస్ ఇటీవలే ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో ఓ అడుగు ముందుకేశారు. ఆయనకు అఫీషియల్ ట్విట్టర్ ఖాతా కూడా లేదు. దీంతో ఈ కోణంలో కూడా దృష్టి సారించారు ప్రేక్షకులు. ఏదేమైనా సర్‌ప్రైజ్ ఇస్తానని స్వయంగా ప్రభాస్ చెప్పడం ఆయన అభిమాన వర్గాల్లో కొత్త జోష్ నింపింది.

 Prabhas tell us to give surprise tomorrow

ప్రభాస్ నటిస్తున్న సాహో విడుదలకు సిద్ధమవుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌ లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటోంది. చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయాలని పాలన్ చేస్తున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X