The Rajasaab: ప్రభాస్‌కే కాదు ఆ హీరో‌యిన్‌కు కూడా డూప్.. రాజాసాబ్‌‌‌ని ఇరికించిన ఫైట్ మాస్టర్‌..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజాసాబ్ మూవీ .. డార్లింగ్ అభిమానులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కాగా.. రిలీజైన క్షణం నుంచి నేటి వరకు రాజాసాబ్‌పై వివాదాలు నెలకొన్నాయి. ఈ సినిమా కథ, కథనం, సీన్స్ అన్నింటిపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌ను పెట్టుకుని ఏం సినిమా తీశావంటూ దర్శకుడు మారుతిని ఫ్యాన్స్, నెటిజన్లు ఆడుకుంటున్నారు.

నటీనటుల నుంచి కంటెంట్ రాబట్టుకోవడంతో పాటు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ విభాగాల్లో మారుతి పనితీరుపై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. దర్శకుడిగా, రైటర్‌గా ఆయన అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దాంతో గత కొద్దిరోజులుగా మారుతి తన ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆయనపై విమర్శల జడివాన ఆగడం లేదు. స్విగ్గి, జొమాటో తదితర ఈ కామర్స్ సైట్స్ నుంచి వందలాది క్యాష్ ఆన్ డెలివరీలు బుక్ చేసి మారుతి ఇంటికి పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నారు.

Prabhas The RajaSaab Faces Massive Trolls Maruthi Under Fire Over Malavika Mohanan body double Controversy

మధ్యలో కొంతకాలం ఈ టార్చర్‌కు బ్రేక్ వేసినప్పటికీ ఎప్పుడైతే రాజాసాబ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ రెచ్చిపోతున్నారు. సినిమాలో ఎన్ని తప్పులు ఉన్నాయో వెతికి వెతికి మరి వాటిని స్క్రీన్ షాట్ల రూపంలో పోస్టులు పెడుతున్నారు. సినిమా ఎలా ఉన్నా.. ఇందులో ప్రభాస్ కోసం ఉపయోగించిన డూప్‌ క్లియర్‌గా తెలిసిపోవడమే అభిమానులను, నెటిజన్ల ఆగ్రహానికి కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అలాగే ప్రభాస్ నటించిన కొన్ని సీన్లలో ఆయనకి తొలుత గడ్డం ఉండటం, క్షణాల్లోనే గడ్డం లేకుండా కనిపించడం వంటి తప్పుల్ని కూడా ప్రశ్నిస్తాడు. అలాగే కథలో లాజిక్ లేకుండా వస్తోన్న సీన్స్‌ని కూడా హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో చిత్ర యూనిట్ కూడా స్పందించడం లేదు. తాజాగా ఈ సినిమా కోసం పనిచేసిన స్టంట్ మాన్ ఒకరు రాజాసాబ్‌ని ఇరికించేశాడు. ఏకంగా హీరోయిన్‌కి సంబంధించిన సీక్రెట్‌ని బయటపెట్టేశాడు. ఈ వివరాల్లోకి వెళితే..

ది రాజాసాబ్‌లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా నటించారు. వీరిని కేవలం అందాలు ఆరబోయడానికి, ప్రభాస్‌తో రొమాన్స్ చేయడానికి తప్పించి దేనికి ఉపయోగించలేదని విమర్శకులు మండిపడ్డారు. అయితే గుడ్డిలో మెల్ల మాదిరిగా నిధి, రిద్ధి కంటే మాళవికకు కాస్త బెటర్ పాత్ర దొరికిందని చెప్పొచ్చు.. ఓ ఫైట్ కూడా చేసింది. అయితే ఈమెకు ఈ సినిమాలో డూప్ ఉందని ది రాజాసాబ్‌లో విలన్ గ్యాంగ్‌లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే నటుడు బయటపెట్టాడు. ఈ మేరకు అతను చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.

విలన్‌గా నటించడం అంటే పెద్ద హీరోలు, హీరోయిన్లతో ఫోటో దిగే అవకాశం దొరకడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ అసిస్టెంట్లను దాటుకుని వాళ్ళని చేరుకోవడం కష్టం కాబట్టి నేను వాళ్ళ డూప్‌లతో సెల్ఫీ దిగి నన్ను నేను సంతృప్తి పరుచుకుంటాను అని విన్సెంట్ రాసుకొచ్చాడు. అంటే హీరోయిన్‌కు డూప్‌ని పెట్టారని అతను చెప్పేశాడు. అది ఎవరికి అనేది కూడా పక్కపక్కనే ఫోటోలు పెట్టాడు. దాంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆఖరికి హీరోయిన్‌కు కూడా డూప్‌ని వాడేశారా అంటూ మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అయితే ఈ పోస్ట్‌పై విమర్శలు రావడంతో కాసేపటికే విన్సెంట్ తన పోస్ట్‌ను డిలీట్ చేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X